రాత్రి నిద్రకు ముందు బొడ్డుపై ఈ నూనె ఓ చుక్క వేశారంటే.. ఆ సమస్యలన్నీ పరార్‌!

నాభిని శరీరంలోని శక్తి కేంద్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆ ప్రాంతానికి నూనె రాయడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతి రాత్రి పడుకునే ముందు నాభిలో ఓ చుక్క ఆముదం రాస్తే, ఊహించలేని ప్రయోజనాలను పొందవచ్చట. ముఖ్యంగా నాభికి ఆముదం రాయడం వల్ల..

రాత్రి నిద్రకు ముందు బొడ్డుపై ఈ నూనె ఓ చుక్క వేశారంటే.. ఆ సమస్యలన్నీ పరార్‌!
Castor Oil On Belly Button

Updated on: Sep 29, 2025 | 7:38 PM

బొడ్డుకు నూనె రాయడం పురాతన కాలం నుండి ఆచరిస్తున్న ఆయుర్వేద పద్ధతి. నాభిని శరీరంలోని శక్తి కేంద్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆ ప్రాంతానికి నూనె రాయడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతి రాత్రి పడుకునే ముందు నాభిలో ఓ చుక్క ఆముదం రాస్తే, ఊహించలేని ప్రయోజనాలను పొందవచ్చట. నాభికి ఆముదం ఎందుకు రాయాలి? ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం..

జుట్టు పెరుగుదల

బొడ్డుకు ఆముదం నూనె రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. అంతే కాదు కడుపును శుభ్రపరచడానికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం

నాభికి ఆముదం నూనె రాయడం వల్ల మలబద్ధకం అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ నాభిలో ఓ చుక్క ఆముదం నూనె రాసుకోవడం వల్ల చర్మంను ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. పీరియడ్స్‌ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి ఆముదం ఓ అద్భుతమైన గృహ నివారణ.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి తగ్గుతుంది

నాభికి ఆముదం రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా ఇది అద్భుతమైన నివారణ. అంతే కాదు నాభికి ఆముదం రాయడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా రాకుండా నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు.

సంతాన సమస్యలు

సంతానోత్పత్తి పరంగా కూడా ఆముదం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని ఔషధ గుణాల కారణంగా బొడ్డుకు ఆముదం రాయడం వల్ల సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే లక్షణాలు రక్త ప్రసరణను పెంచుతాయి. పునరుత్పత్తి అవయవాలు సరిగ్గా పనిచేస్తాయని, సంతానోత్పత్తి సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.