
ఇంట్లో బల్లి కనిపిస్తే చాలు ఆ ప్రదేశంలో కూడా ఉండకుండా పారిపోతారు. వాస్తవానికి అవి ఎవరి జోలికి పోవు కానీ, వాటిని చూసి ఎంతో మంది భయ పడి పారి పోతుంటారు. వామ్మో బల్లి ఇంట్లోకి వచ్చేసింది ? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూనే ఉంటారు. ఇకొందరైతే బల్లి ఇంట్లోకి రాగానే ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారు. ఇలాంటి ఆచారాలు కూడా పాటించే వాళ్ళు ఉన్నారు.
ఇంట్లో బల్లులు ఉంటే శుభమే.. వాటిని అశుభంగా భావించకండి. కనిపిస్తే చాలు చీపురు తీసుకోని బయటకు నెట్టడం, కర్రతో తరిమికొట్టడం లాంటి అనేక చిట్కాలు వాడి వెళ్ళగొడతారు. నిజం చెప్పాలంటే, బల్లులు వలన నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు వాటిని ఇంట్లోంచి వెళ్లగొట్టకుండా ఇంట్లోకి రమ్మని స్వాగతిస్తారు. మరి, ఆ లాభాలేంటో ఇక్కడ వివరంగా చూద్దాం..
అందరి ఇళ్లలో బల్లులు మెరుస్తాయి. ఎందుకంటే, వాటికంటూ ప్రత్యేక స్థావరాలు ఉండవు. కొందరి ఇంట్లో ఇంటి గోడలు, ఫోటో ఫ్రేమ్స్
వెనకాల దాక్కుని ఉంటాయి. మరికొన్ని చెట్ల మీద కనిపిస్తాయి. ఈ బల్లులే మనం ఉన్నా.. లేకపోయినా మన ఇంటిని కాపాడుతుంది. ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తుంది. పొరపాటున వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినప్పుడు అవి సడెన్ గా పడి పోతుంటాయి.
సాధారణంగా అందరి ఇళ్లల్లో బల్లులు గోడల మీద ఉంటాయి. ఇక్కడే ఉంది అసలు సీక్రెట్.. మీకు తెలియకుండా మీ ఇల్లును రోజూ క్లీన్ చేస్తుందని తెలుసా.. సాలెపురుగులు, దోమలు, బొద్దింకలు ఎక్కడా కనిపించిన వంటి వాటిని కడుపునిండా తింటాయి. దీనివల్ల ఇంట్లోకి విషపూరిత కీటకాలు రాకుండా ఉంటాయి. మీరు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. దీంతో, మెయింటెనెన్స్ కూడా తగ్గి డబ్బు ఆదా అవుతుంది.మీరు ఎక్కడైనా చూడండి.. బల్లులు ఉన్న ప్రదేశంలో మొత్తంశుభ్రంగా ఉంటుంది. అక్కడ ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంట్లోకి వచ్చే కీటకాల మొత్తాన్ని ఏరి పారేస్తాయి. ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి. ఇంట్లో బల్లులు ఉండటం ఎంత లాభం.
దోమలు ఒకసారి కుడితే ఎన్ని వ్యాధులు వస్తాయో మనకీ తెలిసిందే. అది ఒకసారి కుట్టి పోతే డెంగ్యూ, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వస్తాయి. ఇలాంటి సమయంలో వారి ఆరోగ్యాన్ని కాపాడటంలో బల్లులు ముఖ్య పాత్ర వహిస్తాయి. 100% లో వీటి వలన 80% లాభాలే ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచైనా బల్లులను ఇంట్లోనుంచి తరిమికొట్టకండి.