Beauty Tips: యాంటీ ఏజింగ్ కోసం అద్భుతమైన ఫేస్ ప్యాక్..! అది కూడా ఇంట్లో ఉండే బెల్లంతో..!

తియ్యగా, ఆరోగ్యకరంగా ఉండే బెల్లం కేవలం ఆహారంలోనే కాకుండా చర్మ సంరక్షణలోనూ అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. దీంట్లోని పోషకాలు మన శరీరానికి మేలు చేయడమే కాకుండా మన ముఖంపై కూడా ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. బెల్లం ఉపయోగించటం వల్ల ముఖానికి ప్రకృతి ప్రసాదించిన సహజ మెరుగు లభిస్తుంది.

Beauty Tips: యాంటీ ఏజింగ్ కోసం అద్భుతమైన ఫేస్ ప్యాక్..! అది కూడా ఇంట్లో ఉండే బెల్లంతో..!
Anti Aging Face Pack

Updated on: Feb 10, 2025 | 6:59 PM

బెల్లంలో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరానికి ఎనర్జీను అందించడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంపై కలిగే మొటిమలను తగ్గించి, నల్లటి మచ్చలను పోగొట్టేలా పనిచేస్తాయి. చర్మం సహజంగా మృదువుగా మారేందుకు బెల్లంతో చేసిన ఫేస్ ప్యాక్ చక్కటి పరిష్కారం.

ఫేస్ ప్యాక్ తయారీ విధానం

బెల్లం ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవడం చాలా సులభం. ఒక చెంచా బెల్లం పొడి, ఒక చెంచా సెనగపిండి, కొద్దిగా పాలు తీసుకొని మిశ్రమాన్ని మెత్తటి పేస్టుగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి సమానంగా అప్లై చేసి, కనీసం 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం తాజాగా కాంతివంతంగా మారుతుంది.

బెల్లంతో సహజ స్క్రబ్ తయారీ

ముఖానికి మరింత మెరుగు కోసం బెల్లంతో స్క్రబ్ చేసుకోవచ్చు. ఒక చెంచా బెల్లం పొడిలో తేనె, అల్లం రసం, కొద్దిగా నిమ్మరసం కలిపి మృదువుగా మర్దన చేయాలి. ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగితే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

బెల్లం రోజ్ వాటర్ తో టోనర్

బెల్లాన్ని రోజ్ వాటర్ తో కలిపి కరిగించి.. ఆ నీటిని ముఖంపై స్ప్రే చేసుకున్నా చాలు. బెల్లంలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు మన ముఖంలోకి వెళ్లి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే దీని సహజ గుణాలు చర్మాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి ఇక నుంచి బెల్లాన్ని కేవలం మిఠాయిల్లో కాకుండా మీ బ్యూటీ రొటీన్‌లో కూడా చేర్చండి.