Leaves for Health: వర్షాకాలంలో ఈ ఆకుల్ని ప్రతి రోజూ తీసుకుంటే ఎన్ని లాభాలో..

వర్షాకాలం మొదలైంది. శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాతావరణంలోని పరిస్థితులను బట్టి శరీరంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎక్కువగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణం తడిగా ఉండటంతో వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి..

Leaves for Health: వర్షాకాలంలో ఈ ఆకుల్ని ప్రతి రోజూ తీసుకుంటే ఎన్ని లాభాలో..
Leaves For Health
Follow us

|

Updated on: Jul 01, 2024 | 3:00 PM

వర్షాకాలం మొదలైంది. శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాతావరణంలోని పరిస్థితులను బట్టి శరీరంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎక్కువగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణం తడిగా ఉండటంతో వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది. వర్షా కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అలా రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసి ఆకులు ఎంతో హెల్ప్ చేస్తాయి. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

తులసి ఆకులతో చాలా రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా తులసి ఆకుల్ని విరివిగా పలు ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ప్రతీ ఇంట్లో తులసి మొక్క ఉండాలని పెద్దు చెబుతూ ఉంటారు. తులసి ఆకుల టీ, కషాయం తాగడం, పొడి చేసి వాడుకుంటూ ఉండటం వల్ల.. త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు. వర్షా కాలంలో తులసి ఆకులు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సీజనల్ వ్యాధులకు బైబై:

వాతావరణం మారినప్పుడల్లా జ్వరం, జలుబు, దగ్గు, నీరసం అనేవి వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే తులసి ఆకులు చక్కగా సహాయ పడతాయి. కొద్దిగా తులసి ఆకుల్ని నీటిలో మరిగించి.. టీ రూపంలో అయినా.. నీటిని అయినా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్యలు తగ్గుతాయి:

వర్షా కాలంలో చాలా మందికి చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చర్మంపై దురద, దద్దుర్లు, గాయాలను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా చర్మంపై ఉండే ఇన్ ఫెక్షన్‌ని కూడా తగ్గిస్తుంది. తులసి ఆకుల్ని నేరుగా అయినా తినవచ్చు. లేదంటే పేస్టులా చేసి చర్మంపై రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.

జీర్ణ సమస్యలు మాయం:

వేసవి కాలంలోనే కాదు వర్షా కాలంలో కూడా చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్, మల బద్ధకం సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాంటి సమయంలో కొన్ని తులసి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి.. జీలకర్రతో పాటు గ్రైండ్ చేసి నీటిలో కలిపి తాగవచ్చు. తేనెతో అయినా తినవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈసారి బడ్జెట్ ‘హోదా’ ఇస్తుందా? రియల్ ‘భూమ్’ తెస్తుందా?
ఈసారి బడ్జెట్ ‘హోదా’ ఇస్తుందా? రియల్ ‘భూమ్’ తెస్తుందా?
చేనేత కార్మికుడి ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్
చేనేత కార్మికుడి ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్
సెక్రటేరియట్‍లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు.. వీడియో
సెక్రటేరియట్‍లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు.. వీడియో
నిల్చున్న నందీశ్వరుడు.. కోరిక చెవిలో చెబితే శివయ్యకు చేరవేస్తాడట
నిల్చున్న నందీశ్వరుడు.. కోరిక చెవిలో చెబితే శివయ్యకు చేరవేస్తాడట
డబుల్ స్పీడ్‌లో డబుల్ ఇస్మార్ట్‌
డబుల్ స్పీడ్‌లో డబుల్ ఇస్మార్ట్‌
సైబర్ నేరాల బారిన పడితే ఇలా చేయండి.. క్షణాల్లో మీ ఖాతాలోకి డబ్బు
సైబర్ నేరాల బారిన పడితే ఇలా చేయండి.. క్షణాల్లో మీ ఖాతాలోకి డబ్బు
అయ్యో భగవంతుడా.. పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల పాప మృతి
అయ్యో భగవంతుడా.. పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల పాప మృతి
ట్యాక్స్ పేయర్స్ కి గుడ్ న్యూస్.. నిర్మలమ్మ పద్దులో కీలక నిర్ణయం
ట్యాక్స్ పేయర్స్ కి గుడ్ న్యూస్.. నిర్మలమ్మ పద్దులో కీలక నిర్ణయం
బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ
బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ
అరంగేట్రంలోనే 2 ట్రోఫీలు గెలిచిన ముగ్గురు.. లిస్టులో మనోళ్లు..
అరంగేట్రంలోనే 2 ట్రోఫీలు గెలిచిన ముగ్గురు.. లిస్టులో మనోళ్లు..