పసుపులో అనేక ఔషద గుణాలుంటాయి. అందుకే పసుపుతో చేసిన వంటకాలు తినడం వల‌్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అయితే పరగడపున పసుపు నీళ్లు తాగడం ద్వారా కూడా అనేక లాభాలు పొందవచ్చునని మీకు తెలుసా..? ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి కూడా పసుపు నీరు ఉపయోగపడుతుంది. ఉదయమే పసుపు నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పసుపు నీటి వల్ల చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. పరగడుపునే పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..
పరగడపున పసుపు నీళ్లు తాగడం వలన శరీర బరువును నియంత్రించుకోవచ్చు. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీర బరువు పెరగకుండా కాపాడతాయి. ఈరోజుల్లో గుండె జబ్బులతో సంభవించే మరణాలు అధికమవుతున్నాయి. పసుపు నీళ్లు తాగడం ద్వారా కొలెస్ట్రాల్ శాతం తగ్గి శరీరంలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కేన్సర్ లక్షణాలను తగ్గించడంలో కూడా పసుసు నీరు దోహదం చేస్తుంది. పసుపు నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుసుపు నీరు తాగడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
అల్జీమర్స్ వ్యాధి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు పరగడపున పసుపు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. పసుపు నీళ్లు తాగడం వల‌్ల రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో విషపదార్థాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పసుపు నీళ్లను తాగడం ద్వారా శరీరంలో గాల్‌బ్లాడర్ ద్వారా బైల్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల‌్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
పసుపులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు శరీరంలోని అనేక నొప్పుల నివారణకు పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు పసుపు నీళ్లు తాగడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పసుపు నీళ్లలోని యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.అంతేకాకుండా కాలేయ ఆరోగ్యానికి కూడా పసుపు ఔషధంలా పనిచేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..