మన అమ్మమ్మల చాలా కాలం నుంచి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఇది స్కిన్ గ్లో కోసం చాలా నమ్మకమైన పదార్ధం. శనగ పిండి వలన చర్మానికి హాని కలిగే అవకాశం చాలా తక్కువ. శనగ పిండి చర్మానికి సహజమైన క్లెన్సర్ లాంటిది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. అదనపు నూనెను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శనగ పిండి పేస్ట్ ని తయారు చేసుకుని అప్లై చేస్తే ముఖంతో పాటు చేతులు, కాళ్ళ చర్మం రంగుని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. శనగ పిండి తక్షణ గ్లో కోసం కూడా ఉపయోగిస్తున్నారు.
శనగపిండిని కొన్ని పదార్థాలతో కలిపి చర్మానికి రాసుకుంటే మొటిమలు తగ్గడం, ఛాయను మెరుగుపరడమే కాదు సహజమైన మెరుపు కూడా సంతరించుకుంటుంది. కనుక తక్షణం గ్లో పొందడానికి శనగపిండిని ఏయే పదార్థాలతో కలపడంతో బెస్ట్ రిజల్ట్ వస్తాయో తెలుసుకుందాం.
తక్షణ గ్లో కోసం ఈ పదార్థాలతో కలిపిన శనగపిండిని అప్లై చేయండి..
తక్షణ మెరుపు కోసం, బంగాళాదుంప రసం, చిటికెడు పసుపు, కలబంద జ్యూస్ , శనగ పిండిని కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై చేతులతో మసాజ్ చేయడం ద్వారా శుభ్రం చేసుకోండి. దీంతో చర్మం బంగారు మెరుపుని సంతరించుకుంటుంది. వాస్తవానికి శనగ పిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అయితే కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. బంగాళదుంప రసం సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. పసుపు గ్లోను పెంచుతుంది.
చర్మంలోని మృతకణాలు తొలగిపోయి గ్లో పెరగడం కోసం
చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకున్నప్పుడు ముఖం డల్ గా కనిపించడం మొదలవుతుంది. కనుక దాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రెండు చెంచాల శనగ పిండిలో సమాన పరిమాణంలో పెరుగు, ఒక చెంచా తేనె, ఒక టీస్పూన్ కాఫీ కలపండి. ఈ మిశ్రాన్ని తీసుకుని వృత్తాకార కదలికలో సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా ఈ మిశ్రమంతో ముఖాన్ని స్క్రబ్ చేయండి. కాఫీ చర్మం నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా రంధ్రాలను శుభ్రపరుస్తుంది. పెరుగు, తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
చర్మం చాలా పొడిగా ఉంటే.. శనగపిండిని ఉపయోగించేటప్పుడు, పెరుగు లేదా కలబందను జోడించాలి. ఇక్కడ పేర్కొన్న స్కిన్ కేర్ ప్యాక్, స్క్రబ్‌ని వారానికోసారి అప్లై చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..