ఈ అద్భుతమైన టీ మీ ముఖాన్ని అందంగా మార్చేస్తుంది..! చర్మ సౌందర్యం కోసం..

|

Jun 17, 2024 | 6:14 PM

మొటిమలు, మచ్చల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టీలో కాల్షియం, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మంతో పాటు మెరుపును అందిస్తుంది.

ఈ అద్భుతమైన టీ మీ ముఖాన్ని అందంగా మార్చేస్తుంది..! చర్మ సౌందర్యం కోసం..
Jeera Saunf Ajwain Tea Benefits
Follow us on

ప్రస్తుత రోజుల్లో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బిజీ బిజీ జీవనవిధానం, చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం ముఖంపై అనేక సమస్యలకు కలిగిస్తుంది. దీని వల్ల అందమైన ముఖం డల్ గా కనిపించడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో వంటింట్లో లభించే మసాలలతో తయారు చేసిన సహజ టీ తాగడం వల్ల ముఖ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాంటిదే సోంపు, జీలకర్ర, ధనియాలతో తయారు చేసిన అద్భుత టీ. సోంపు, జీలకర్ర, ధనియాలు అన్ని ఇళ్లలో వాడతారు. ఆహారం రుచి, పోషకాలను మెరుగుపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. మరిన్ని ప్రయోజనాలను పొందడానికి, మీరు జీలకర్ర, సోంపు, ధనియాల కషాయంతో తయారు చేసుకుని తాగొచ్చు. దీని వల్ల ఆరోగ్యం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.

అంతే కాకుండా ఈ మూడింటిని కలిపి టీ తయారు చేసి తాగవచ్చు. వేసవిలో శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక విషయాల్లో ఈ అద్బుత టీ ఎంతో మేలు చేస్తుంది. ఇది రోజంతా తాజాదనంతో ఉండేలా సహజమైన మెరుపును ఇస్తుంది. జీలకర్ర, సోంపు, ధనియాలతో తయారు చేసిన టీ చర్మానికి యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఈ మూడింటిలో ఖనిజాలు, విటమిన్లకు స్టోర్హౌస్. చర్మ సంబంధిత సమస్యలపై సంపూర్ణంగా పనిచేసే క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల ముఖంపై ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

వేసవిలో జిడ్డు చర్మంతో బాధపడేవారు ఈ టీ తాగాలి. ఎందుకంటే వేడి, చెమట కారణంగా, చర్మంపై ఎక్కువ నూనె కనిపిస్తుంది. దానిపై మురికి పేరుకుపోతుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
అలాగే, వేసవిలో మొటిమల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ పరిష్కారం చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని అందించడంలో సమృద్ధిగా ఉంటుంది. మొటిమలు, మచ్చల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టీలో కాల్షియం, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మంతో పాటు మెరుపును అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ టీని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ టీ చేయడానికి, అర టీస్పూన్ జీలకర్ర, ధనియాలు, సోంపు తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం బాగా మరిగించి ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. దానికి కొంచెం తేనె, సగం నిమ్మకాయ, ఉప్పు కలుపుకుంటే, మీ టీ సిద్ధమవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..