
ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడానికి, టాయిలెట్‌ను కూడా ప్రతిరోజూ శుభ్రం చేయాలి. లేకపోతే, క్రిములు త్వరగా ఇల్లు అంతటా వ్యాపిస్తాయి. ప్రతిరోజూ శుభ్రం చేసినా టాయిలెట్ కమోడ్‌లోని పసుపు మరకలు పోవు. అనేక రకాల క్లీనర్ ఉపయోగించినప్పటికీ కొన్ని సార్లు ఈ సమస్యను పరిష్కరించలేరు. మీ ఇంటి టాయిలెట్ కమోడ్‌లో కూడా ముదురు మరకలు ఉన్నాయా? అలా అయితే, వాటిని తొలగించడానికి మీకు ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు, మనం తిని పడేసే అరటిపండు తొక్క ఉంటే చాలు. అవును ఈ తొక్కతోనే మనం టాయిలెట్‌ను శుభ్రం చేయవచ్చు.
అరటి తొక్కతో టాయిలెట్ కమోడ్ ఎలా శుభ్రం చేయాలి?
టాయిలెట్ కమోడ్ నుండి మొండి మరకలను తొలగించడానికి మీరు అరటి తొక్కలను ఉపయోగించవచ్చు. మనం పనికిరానివిగా పారేసే అరటి తొక్కలు సహజంగానే మురికి, మరకలను తొలగించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఉపయోగించి ఈజీగా మరకలను తొలగించవచ్చు.
దానికోసం, ముందుగా మీరు అరటి తొక్కను మిక్సర్ జార్‌లో వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక జార్‌లోకి తీసుకొని ఉంచుకోవాలి. దానికి కొంచెం నీరు వేసి బాగా కలిపి మందపాటి పేస్ట్‌ను తయారు చేసుకోండి. తర్వాత దానికి కొంచెం షాంపూను కలిపి బాగా షేక్ చేయండి. అంటే మీ సహజ టాయిలెట్ క్లీనర్ రెడీ అయినట్టే.
ఇప్పుడు ఈ క్లీనర్ మిశ్రమాన్ని టాయిలెట్ కమోడ్ మీద పోసి, కాసేపు అలాగే ఉంచి, బ్రష్ తో బాగా స్క్రబ్ చేయండి. తర్వాత నీటితో దాన్ని మొత్తం శుభ్రం చేసుకోండి, అప్పుడు మీ టాయిలెట్‌పై ఉన్న మొండి మరకలు తొలగిపోయి.. మీ టాయిలెట్ కొత్తగా కనిపిస్తుంది. ఈ సింపుల్ టాయిలెట్ క్లీనింగ్ హ్యాక్ ని ప్రయత్నించండి.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిటి మేము దృవీకరించట్లేదు.. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.