పట్టులాంటి జుట్టు కోసం అరటిపండుతో హెయిర్‌ మాస్క్‌.. మీ కురులు నిగనిగలాడటం గ్యారెంటీ..!

చక్కటి హెయిర్ మాస్క్‌ తయారవుతుంది. రెండింటినీ బాగా మిక్స్ చేసి, సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలపై అప్లై చేయండి. అరగంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేయండి.. ఇలాంటి ఇంటి చిట్కాలను తరచూ పాటించటం వల్ల తొందరలోనే మీ జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది. ఇవి మీ జుట్టు పెరుగుదలను, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

పట్టులాంటి జుట్టు కోసం అరటిపండుతో హెయిర్‌ మాస్క్‌.. మీ కురులు నిగనిగలాడటం గ్యారెంటీ..!
Banana Hair Mask
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2023 | 6:04 PM

నేటి కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టుకు సంబంధించిన వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి అతి పెద్ద సమస్య జుట్టు పొడిబారడం, రాలిపోవడం. జుట్టు పొడిగా మారడానికి అనేక కారణాలున్నాయి. జుట్టు పొడిగా మారితే అతి జుట్టు రాలిపోయే సమస్యకు దారితీస్తుంది. జీవనశైలి, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, హెయిర్ ట్రీట్‌మెంట్ మొదలైన కారణాల వల్ల జుట్టు ప్రభావితమవుతుంది. బలహీనమైన జుట్టు సమస్యను నయం చేయడానికి మీరు అరటిపండును ఉపయోగించవచ్చు. అరటిపండులో విటమిన్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు పెరుగుదలను, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

జుట్టును బలోపేతం చేయడానికి, పొడితన్నాని తగ్గించడానికి అరటి పండు హెయిర్ మాస్క్ ఉపయోగించవచ్చు. ఈ బనానా మాస్క్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అరటిపండుతో పాటు కొన్ని పదార్థాలను కలుపుకుని ఈ మాస్క్‌ను తయారుచేస్తారు. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గించి జుట్టు మూలాలను బలపరుస్తుంది.

గుడ్లు- అరటిపండు..

ఇవి కూడా చదవండి

జుట్టు స్ట్రాంగ్ గా, సాఫ్ట్ గా మారాలంటే అరటిపండ్లతో పాటు గుడ్లను కూడా వాడుకోవచ్చు. దీని కోసం అరటిపండు, గుడ్డు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై జుట్టును షాంపూతో కడగాలి.

ఆలివ్ నూనె- అరటిపండు..

అరటిపండు పేస్ట్‌లా చేసి, దానికి ఆలివ్ ఆయిల్‌ను అవసరం మేరకు రాసి జుట్టు మూలాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత హెయిర్ క్యాప్ వేసుకుని 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఆలివ్ నూనెకు బదులుగా మీరు అరటిపండుతో పాటు కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు.

పెరుగు- అరటిపండు..

అరటిపండు, పెరుగు రెండూ ఇంట్లో సులభంగా దొరుకుతాయి. ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి, అరటిపండు పేస్ట్‌లో పెరుగు వేసి బాగా మిక్స్‌ చేయాలి. చక్కటి హెయిర్ మాస్క్‌ తయారవుతుంది. రెండింటినీ బాగా మిక్స్ చేసి, సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని జుట్టు మూలాలపై అప్లై చేయండి. అరగంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేయండి.. ఇలాంటి ఇంటి చిట్కాలను తరచూ పాటించటం వల్ల తొందరలోనే మీ జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఇంటి నివారణలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఏదైనా సందేహాలు ఉన్నా, వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..