Ayurveda Tips: రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యి తినండి.. షాకింగ్ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

|

Jun 06, 2024 | 10:44 AM

ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తూ తినే ఆహారంలో దేశీ నెయ్యిని చేర్చుకుంటున్నారు. దేశీ నెయ్యి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో దేశీ నెయ్యిని తీసుకుంటే.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజు పరగడుపున నెయ్యి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Ayurveda Tips:  రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యి తినండి.. షాకింగ్ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
Ghee On Empty Stomach
Follow us on

పెద్ద పెద్ద నగరాల్లో రోజు రోజుకీ రద్దీ పెరిగిపోతుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. జీవన శైలిలో కూడా వచ్చిన మార్పులతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే గత కొంతకాలంగా తమని తాము కాపాడుకునేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు కొంతమంది తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగాకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీనితో పాటు కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ లేదా గ్రీన్ టీ తాగుతారు. అయితే ప్రస్తుతం కొంతమంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తూ.. ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ప్రారంభించారు. నెయ్యి ఆరోగ్యానికి వరంలా పని చేస్తుంది. అయితే తినే నెయ్యి దేశవాళీ నెయ్యి అయి ఉండాలి. లేదంటే నెయ్యి తినడం వెంటనే మానేయడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు వంటలలో శుద్ధి చేసిన నూనెను ఉపయోగిస్తున్నారు.. మరికొందరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తూ తినే ఆహారంలో దేశీ నెయ్యిని చేర్చుకుంటున్నారు. దేశీ నెయ్యి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో దేశీ నెయ్యిని తీసుకుంటే.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజు పరగడుపున నెయ్యి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
రోజూ ఖాళీ కడుపుతో దేశీ నెయ్యిని తీసుకుంటే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దేశీ నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలుగా పని చేయడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియను సున్నితంగా చేస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల స్రావానికి కూడా సహాయపడుతుంది. సరళంగా చెప్పాలంటే.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు నియంత్రణ
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యి తినడం వల్ల బరువును నియంత్రించుకోవడం సులభం అవుతుంది. దేశీ నెయ్యి అనేది ఒక రకమైన ఆరోగ్యకరమైన కొవ్వు పదార్దం. నెయ్యి ఎక్కువసేపు కడుపుని నిండుగా ఉంచుతుంది. తద్వారా ఎంత ఇష్టమైన ఆహారం అయినా అతిగా తినకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం
నెయ్యి అంటువ్యాధులతో పోరాడటానికి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో ప్రయోజనకరంగా నిరూపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్ దేశీ నెయ్యిలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించండి
మన రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు కనిపిస్తాయి. వీటిలో LDL హానికరమైన కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడానికి, ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా దేశీ నెయ్యి తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..