Diabetes: మామిడి, అల్లం, ఉసిరి, పసుపుతో తయారు చేసిన మిశ్రమాన్ని రోజూ పరగడుపున తిన్నారంటే..

|

Mar 06, 2022 | 7:41 PM

చక్కెర వ్యాధిగా పిలిచే డయాబెటిస్ చిన్నా.. పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. దీనితో వచ్చిన పెద్ద చిక్కేంటంటే ఒక్క సారి దీని బారీనపడితే అది ఇక ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అంటే డయాబెటిస్ శాశ్వత నివారణ లేదన్నమాట..

Diabetes: మామిడి, అల్లం, ఉసిరి, పసుపుతో తయారు చేసిన మిశ్రమాన్ని రోజూ పరగడుపున తిన్నారంటే..
Ayurveda For Diabetes
Follow us on

Start eating this ayurvedic tonic to control your blood sugar levels: చక్కెర వ్యాధిగా పిలిచే డయాబెటిస్ చిన్నా.. పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. దీనితో వచ్చిన పెద్ద చిక్కేంటంటే ఒక్క సారి దీని బారీనపడితే అది ఇక ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అంటే డయాబెటిస్ శాశ్వత నివారణ లేదన్నమాట. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చక్కని జీవనశైలి (Lifestyle diseases) ద్వారా మాత్రమే దీనిని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఐతే రక్తంలో చక్కెర స్థాయి అనియంత్రితంగా పెరిగితే, అది ప్రాణాంతకంగా మారుతుంది. మరి రక్తంలో చక్కెరను నియంత్రించడమెలా? అనే కదా మీ సందేహం.. అందుకు అనేక మార్గాలున్నాయండీ! వాటిలో ఒకటి పసుపు. పసుపులోని కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక వ్యాధులకు రోగనివారిణిగా పనిచేస్తుంది. పరిమిత మోతాదులో పసుపు తినడం వల్ల రక్తంలో చక్కెర (blood sugar)స్థాయిలు తగ్గుతాయని చాలా అధ్యయనాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, పసుపును మామిడి లేదా అల్లంతో కలిపి తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా పసుపు, ఉసిరి, అల్లంలతో తయారు చేసిన ద్రావకంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు వనకూరుతాయి.

ఉసిరి, అల్లం, మామిడికాయ రసాన్ని పసుపుతో కలిపి తాగితే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. ఈ మూడింటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెరను నిరోధించడమేకాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అల్లం, పసుపు లక్షణాలు అజీర్ణం, కడుపు నొప్పి, వికారం వంటి కడుపు సమస్యలకు చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ పరగడుపున ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం మీరే చూస్తారు. అలాగే జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. శోథ నిరోధక లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతాయి. జలుబు, దగ్గుతో పోరాడే గుణాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. మామిడి విటమిన్ల స్టోర్‌హౌస్ అనే విషయం తెలిసిందే. ఇవి శరీరంలో రోగనిరోధకతను పెంచడంలో సహాయపడతాయి. ఐతే ఈ మిశ్రమాన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి సుమీ!

Also Read:

Fennel Seeds: సోంపు గింజలు ప్రతి రోజూ తింటున్నారా? ఐతే ఈ షాకింగ్‌ విషయాలు తెలుసుకోండి..