
చికెన్.. అంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు. చికెన్‌ను కూరగా.. ఫ్రైగా.. ఇంకా మరెన్నో రకాలుగా వండుకుని ఇష్టంగా తింటారు.. ఆదివారం చాలా మంది నాన్ వెజ్ తినే వారుంటారు.. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో వారానికి ఒకటి రెండు సార్లు కాకుండా నిత్యం చికెన్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే.. ప్రోటీన్ పుష్కలంగా ఉండే చికెన్.. తినడం మంచిదే.. కానీ, చికెన్ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ సులభంగా జరగడానికి కొన్ని సూచనలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు..
చికెన్ తో పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉండగా, పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుందని, గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2022 నివేదిక పేర్కొంది.
అలాగే, చికెన్ తిన్న వెంటనే స్వీట్లు, చక్కెర పదార్థాలు లేదా జ్యూసులు వంటి వాటికి దూరంగా ఉండాలి. అధిక చక్కెర పదార్థాలు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను అస్థిరం చేసి త్వరగా అలసటకు కారణమవుతాయి. నిమ్మకాయ, నారింజ వంటి ఆమ్ల వంటి వాటిని కూడా చికెన్ తో కలిపి తినడం మంచిది కాదు. ఇవి పొట్టలోని ద్రవాలతో కలిసి ఎసిడిటీని పెంచుతాయి.
చివరగా, చికెన్ భోజనం అనంతరం బజ్జీలు, చిప్స్ వంటి నూనెలో వేయించిన స్నాక్స్ తినడం మానుకోవాలి. ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరానికి మంట, నీరసం కలుగవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ జాగ్రత్తలు పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..