AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Curry: పాత కాలంనాటి రోలు చేపల పులుసు.. ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ గిన్నెలు కొద్దీ ఎగబడి తింటారు..

మీరు రెగ్యులర్ చేపల కర్రీ బోర్‌ కొట్టిందా? చేపలతో కొత్తగా స్పైసీగా ఏదైనా రెసిపీ ట్రై చేయాలని ఉందా? అయితే ఈ సండే రోలు ఉపయోగించి ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలతో మన అమ్మమ్మల కాలంలో ఎంతో ఫేమస్ అయిన చేపల పులుసు ట్రై చేయండి. ఒక్కసారి మీరు కనుక ఈ పుసులు తింటే.. మళ్లీ మళ్లీ ఇదే కావాలి అంటే.. మరీ దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి.

Fish Curry: పాత కాలంనాటి రోలు చేపల పులుసు.. ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ గిన్నెలు కొద్దీ ఎగబడి తింటారు..
Authentic Village Style Fish Curry
Anand T
|

Updated on: Oct 07, 2026 | 2:53 PM

Share

నాన్‌ వెజ్ ప్రియులల్లో చేపలకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. సండే వచ్చిందంటే చాలు వీళ్లకు కచ్చితంగా చేపటు ఉండాల్సిందే. అయితే ఈ చేపల కర్రీని రోటీన్‌గా కాకుండా అమ్మమ్మ కాలం నాటి రుచితో, సంప్రదాయ వంట పద్ధతిలో చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది. అయితే ఈ కర్రీకి టెస్ట్ రావాలంటే ఆదునికి మిక్సీలు కాకుండా మన పూర్వికులు వాడే రోలును మాత్రమే ఉపయోగించి పదార్థాలను దంచడం చేయాలి. అదెలానో ఇక్కడ చూద్దాం.

అమ్మమ్మల కాలం నాటి చేపల కర్రీ తయారీ విదానం

ప్టెప్-1: మొదట, నాలుగు పెద్ద ఎర్రగడ్డలను తీసుకుని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. దంచిన తర్వాత వచ్చే నీరు చేపల పులుసుకు ఒక ప్రత్యేక రుచిని ఇస్తుంది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత, రెండు టమాటాలను తీసుకుని, మధ్యలో ఉండే తెల్లటి గట్టి భాగాన్ని తొలగించి, వాటిని కూడా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బాల్ సైజు చింతపండును తీసుకుని, నీరు పోసి కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి. వేడినీళ్లు వాడితే తొందరగా నానుతుంది.

ప్టెప్-2: ఇప్పుడు ఒక పాన్ స్టవ్ మీద పెట్టి, నూనె లేకుండా అర చెంచా మెంతులు, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా ఆవాలు వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని, రోట్లో వేసి దంచాలి. దీనికి నాలుగు వెల్లుల్లి రెబ్బలను చేర్చి, మెత్తని పొడిగా దంచాలి. ఈ మసాలా పొడిని కూడా పక్కన పెట్టుకోవాలి.

ప్టెప్-3:  తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపై బనాలి పెట్టి రెండు గంటల నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కగానే ఒక చెంచా జీలకర్ర, మూడు ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత, ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ను వేసి బాగా వేగనివ్వాలి. దీనికి రుచికి సరిపడా పసుపు, కరివేపాకు వేసి, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత, దంచి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ను వేసి రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఒక చెంచా ఉప్పు, మూడు చెంచాల కారం వేసి బాగా కలిపి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

ప్టెప్-4: ఇప్పుడు నానబెట్టిన చింతపండును పిసికి, రెండు సార్లు పులుసు తీసి వడకట్టి, దబరలోని మసాలా మిశ్రమంలో పోయాలి. అవసరాన్ని బట్టి నీటిని చేర్చుకోవచ్చు. పులుసు రుచి చూసి, అవసరమైతే ఉప్పు సర్దుబాటు చేయాలి. పులుసును బాగా మరిగించాలి. ఈలోగా, ఒక కిలో చేపలను శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. పులుసు బాగా తెర్లిన తర్వాత, చేప ముక్కలను ఒక్కొక్కటిగా పులుసులో వేయాలి. ముక్కలు వేసిన తర్వాత, గరిటెతో కలపకుండా, దబరను అటూ ఇటూ తిప్పుతూ పులుసును కలపాలి. ఇది చేప ముక్కలు చెదిరిపోకుండా సహాయపడుతుంది. మూత పెట్టి సుమారు పది నిమిషాలు ఉడికించాలి.

ప్టెప్-5: చేపలు ఉడికిన తర్వాత, ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడిని చేపల పులుసుపై చల్లుకోవాలి. పొడి ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మళ్లీ గరిటె వాడకుండా దబరను తిప్పుతూ మసాలా పొడి పులుసులో కలిసేలా చేయాలి. మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి, దీనివల్ల మసాలా రుచి పులుసుకు బాగా పడుతుంది. చివరిగా, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి, దబరను మళ్లీ ఒకసారి తిప్పుకోవాలి. వేడి వేడి, రుచికరమైన అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us