Heart Attack: గుండె ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం..! ఈ సంజీవిని లాంటి మొక్క ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు

నేటి బిజీ లైఫ్‌లో ప్రజల్లో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. దీంతో పాటుగా హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య కూడా పెరిగింది. పెరుగుతున్న గుండెపోటు కేసులను నివారించడానికి ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అర్జున బెరడు గుండె సమస్యలకు ఒక వరం అంటున్నారు నిపుణులు.. టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, కౌమరిన్ వంటి దాని ఔషధ గుణాలు గుండె కండరాలను బలపరుస్తాయి.

Heart Attack: గుండె ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం..! ఈ సంజీవిని లాంటి మొక్క ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు
Arjuna Bark

Updated on: Sep 01, 2025 | 9:44 AM

ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలలో ప్లాక్ ఏర్పడటం. పెరుగుతున్న గుండెపోటు కేసులను నివారించడానికి ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అర్జున బెరడు గుండె సమస్యలకు ఒక వరం అంటున్నారు నిపుణులు.. టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, కౌమరిన్ వంటి దాని ఔషధ గుణాలు గుండె కండరాలను బలపరుస్తాయి.

అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. అర్జున బెరడు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రిస్తుంది. కేవలం రూ. 15 కి లభించే అర్జున బెరడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతుంది.

నేటి బిజీ లైఫ్‌లో ప్రజల్లో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. అర్జున బెరడుతో తయారు చేసిన కషాయం ఒత్తిడిని తగ్గించి, మనశ్శాంతిని అందిస్తుంది. అర్జున బెరడులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలో మనకు తెలియకుండా ఏర్పడే కణతుల పెరుగుదలను నియంత్రించడంలోఉపయోగపడుతుంది. అర్జున బెరడులోని విటమిన్ ఈ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది. అర్జున బెరడుతో పాటు, అశ్వగంధ వంటి ఇతర ఆయుర్వేద మూలికలు కూడా గుండె ఆరోగ్యానికి మంచివి. అవి ఒత్తిడిని తగ్గించి గుండెను రక్షిస్తాయి. అందువల్ల అర్జున బెరడును ఉపయోగించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.