Health Tips: వర్షా కాలంలో ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి?

చాలా మందికి ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగాలని సిఫార్సు చేస్తుంటారు. దీంలో మనం కూడా దాన్ని పాటిస్తుంటాం. వీటి వల్ల కలినే ప్రయోజనాలే కాకుండా నష్టాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. లెమన్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కవగా ఉండటం వల్ల, దంతాల కోత, గుండెల్లో మంట, కడుపు పూతల వంటి సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి దీన్ని భోజనం తర్వాత తాగితే, అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Health Tips: వర్షా కాలంలో ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి?
నిమ్మకాయ నీరు విటమిన్ సి, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది శరీరానికి సహజ శక్తి పానీయంగా పనిచేస్తుంది. దీని పోషకాలు శరీరాన్ని ఉత్తేజపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, ఫ్లూ, సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది.

Updated on: Jul 22, 2025 | 12:02 PM

వర్షా కాలంలో చాలా మందికి ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగాలని సిఫార్సు చేస్తుంటారు. దీంలో మనం కూడా దాన్ని పాటిస్తుంటాం. వీటి వల్ల కలినే ప్రయోజనాలే కాకుండా నష్టాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది అనేక రకాల కొత్త అలవాట్లు చేసుకుంటారు. అందులో ముఖ్యంగా వ్యాయామం చేసి బరువు తగ్గడమేకాకుండా.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన జ్యూస్ లేదా సూప్ తయారు చేసి తాగుతారు. ఇందులో భాగంగా ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు లేదా రసం తాగుతూ ఉంటారు. జిమ్ ట్రైనర్లు కూడా బరువు తగ్గడానికి ఇది గొప్ప మార్గం అని చెబుతుంటారు. కానీ వీటి కారణంగా కొన్ని సార్లు మనం అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగవల్ల ఏం జరుగుతుంది?

సాధారణంగా, నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ, దంత ఆరోగ్యం, జీర్ణశయాంతర వ్యవస్థతో సమస్యలు రావచ్చు. ఈ అలవాటు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, ఏవిదంగా హానికరం అవుతుందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య నిపుణులు ప్రకారం.. చాలా మందికి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా నీరు తాగిన తర్వాత గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఎదుక్కొన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా నిమ్మకాయలోని ఆమ్లం నెమ్మదిగా మన దంతాల రక్షణ పొరను క్షీణింపజేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో పదే పదే నిమ్మరసం తాగడం వల్ల కడుపు పొర దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయట. అంతే కాకుండా ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో డీహైడ్రేషన్, సోడియం, పొటాషియం కూడా తగ్గవచ్చ ని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మరసం ఎప్పుడు తాగడం సురక్షితం?

మనం ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత నిమ్మరసం తాగడం ఎల్లప్పుడూ సురక్షితం. నిమ్మరసాన్ని ముందుగా గోరువెచ్చని నీటిలో కలిపి, దానిలో కొద్దిగా తేనె లేదా చిటికెడు ఉప్పు కలిపి తాగవచ్చు. దంతాలను కాపాడుకోవడానికి, తగినంత ఆహారం తిన్న తర్వాత తాగడం మంచిది. బరువు తగ్గడం మంచి విషయమే. అదే సమయంలో, బరువు తగ్గేటప్పుడు మన ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదు. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం అందరికీ మంచిది కాదు. సరే మీకు ఈ అవాటు ఉంటే, దాని వల్ల ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచింది

గమనిక: కొన్ని నేవిదికలు, ఆరోగ్య నిపుణుల సూచనల ద్వారా వీటిని తెలియజేస్తున్నాం.. వీటి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గర్లోని వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.