Aluminium Utensils: సంక్రాంతికి ఈ పాత్రల్లో వంటచేస్తున్నారా? జాగ్రత్త.. ఆ జబ్బులన్నీ మీ ఇంట్లోనే

సాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో అల్యూమినియం పాత్రలనే వాడుతారు. ఎందుకంటే ఇవి చాలా తేలికగా ఉంటాయి అలానే ధర కూడా తక్కవే.. అందుకే మధ్య తరగతి ప్రజలు వీటినే ఇంట్లో వంట చేయడానికి ఎక్కువగా వాడుతారు. అయితే వీటిల్లో వండిన ఆహారం తినడం మంచిదేనా, కాదా అనే అపోహలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. వీటి గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం పదండి.

Aluminium Utensils: సంక్రాంతికి ఈ పాత్రల్లో వంటచేస్తున్నారా? జాగ్రత్త.. ఆ జబ్బులన్నీ మీ ఇంట్లోనే
Aluminum Cookware Dangers

Updated on: Jan 14, 2026 | 6:41 PM

ఒకప్పుడు కుండల్లో వండుకునే రోజుల నుంచి నేడు స్టీల్‌, అల్యూమినియం పాత్రల్లో జనాలు వండుకొని తింటున్నారు. చాలా మంది మద్య తరగతి ప్రజలు స్టీల్ వాటికన్నా అల్యూమినియం పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాటిలోనే ఎక్కువగా వండుకుంటారు.ఎందుకంటే ఇవి చాలా చైకగా లభిస్తాయని.. అయితే వీటిలో వండిన ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో చాలా మందిలో విటిలో ఆహారం వడుకొని తినడం సురక్షితమేనా కాదా అనే డౌట్ మొదలైంది. అయితే వాస్తవమేంటంటే.. అల్యూమినియం పాత్రల్లో వండి ఆహారం తినడం వల్ల నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయట. అదెలానో ఇక్కడ చూద్దాం.

అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తినడం సురక్షితమేనా

అల్యూమినియం అనేది చాలా తేలికైన లోహం అందుకోసమే వీటని పాత్రల తయారీలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇది వేడికి త్వరగా ప్రభావితం అవుతుంది. మనం అల్యూమినియం పాత్రల్లో వంటచేసేప్పుడు అందులోని సూక్ష్మ కణాలు మనం తినే ఆహారంలో కలిపోతాయి. ఆలా వండిన ఆహారాన్ని తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తింటే ఎలా సమస్యలు వస్తాయి

అల్యూమినియం పాత్రలలో వండే ఆహారాలను ఎక్కువ రోజుల పాటు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. దీన్ని మనం దీర్ఘకాలికంగా కొనసాగించడం వల్ల శరీరంలో అల్యూమీనియం శాతం పెరుగుతుంది. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కొన్ని సార్లు కిడ్నీ ఫెయిలయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అల్యూమినియం అనేది మన శరీరంలో క్యాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనత, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చు. అలాగే ఈ పాత్రల్లో వండి ఫుడ్ తినడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అల్యూమినియం పాత్రల్లో వండే ఆహారం తినే ముందు ఆలోచించండి.

ఏ పాత్రలో వండుకోవడం బెస్ట్

మీరు అల్యూమినియం పాత్రల ప్లేస్‌లో స్టీల్‌ పాత్రలు లేదా మట్టి కుండలను ఉపయెగించడం బెస్ట్. ఎందుకంటే ఇవి కాస్తా బరువుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి సుక్షితంగా ఉంటాయి. స్టీల్, మంటికుండల్లో వండిన వంటకాల్లో పోషకాలు అలాగే ఉంటాయి. అంతేకాదు వీటిలో ఉండే ఆహారం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఇవే కాదు రాగి పాత్రలు కూడా ఆహారం వండుకునేందుకు ఉత్తమమైన ఎంపికజ.

అల్యూమినియం పాత్రల్లో వండేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే అల్యూమినియం పాత్రలు వండుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు. మీరు పొరపాటున కూడా అల్యూమీనియం పాత్రల్లో టమాటా లేదా ఇతర పుల్లటి ఆహారాలను వండకండి. అలాగే అల్యూమినియం పాత్రను ఎక్కవ సమయం స్టౌ పై ఉంచకండి. అలాగే మీరు కర్రీ చేసేప్పుడు అడుగు అంటుతే దాన్ని గరిటెతో గీకి తీసుకొవద్దు. అలా చేయడం ద్వారా లోహం కరిగి ఆహారంలోకి చేరవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.