Ants Trouble: చీమలు ఒక సాధారణమైన సమస్య గృహణిలకు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నిత్యం ఎదో ఒక పక్క చీమలు ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. ఒక పక్క ఆహార పదార్ధాలపై దాడి చేస్తాయనే భయం ఉంటుంది. మరోపక్క అవి కుడితే పడే ఇబ్బంది కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న ఇంట్లో చీమలతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సాధారణంగా ఇప్పుడు ఇళ్లను కట్టేటప్పుడే చీమలు, చెదలు పట్టకుండా ఉండేలా రసాయనాలతో పునాదులను నింపేసి కడుతున్నారు. కానీ, అది కొంతకాలం మాత్రమే రక్షణ ఇస్తుంది. మాటిమాటికీ రసాయనాలతో ఇంటిలో ఇలా చీమలను తరిమే పని పెట్టుకోవడమూ సాధ్యం కాదు. ఎక్కువగా వానాకాలంలో చీమల బాధ ఉంటుంది. చీమలు ఇంట్లోకి చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా చీమలను ఇంటిలోకి రానీయకుండా చూసుకోవచ్చు.
ముఖ్యంగా ఇంటిలో పరిశుభ్రతను పాటించాలి. ఇంటిలో పరిశుభ్రత లేకపోతే మొదటగా దాడి చేసేవి చీమలే. అదేవిధంగా గదుల మూలల్లో తేమ లేకుండా ఉండడమూ అవసరం. గోడలకు వచ్చే బీటలు.. ఫ్లోరింగ్ లో పగుళ్లు వంటివి చీమలు చేరే అవకాశం కల్పిస్తాయి. ఇలా ఎక్కడన్నా పగుళ్లు ఉంటే కనుక వెంటనే వాటిని మూసేసుకోవాలి. ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ తీపి పదార్ధాలు పారేయకుండా చూసుకోవాలి. పిల్లలు ఉన్న ఇంట్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వారు తినిన ఆహారపదార్ధాల అవశేషాలు నేలమీద పడటం వలన వాటికోసం చీమలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జాగ్రత్తలు తీసుకున్నా చీమలు వస్తే ఇలా చేసి చూడండి..
బోరిక్ ఆమ్లం – చీమలను తిప్పికొట్టడానికి ఈ పదార్ధం మంచిది. ఈ పొడిని చీమలు తిరుగాడుతున్న ప్రదేశాల్లో చల్లుకోవాలి. అయితే.. పిల్లలు దానికి దగ్గర కాకుండా జాగ్రత్త పడాలి.
ఉప్పు-నిమ్మ – నిమ్మరసం చీమలను తిప్పికొడుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చీమల ఉనికిని నిరోధిస్తుంది. చీమలను నిరోధించడానికి నిమ్మరసం, నీటి మిశ్రమాన్ని చీమలు వ్యాపిస్తున్న ప్రాంతాల్లో పిచికారీ చేయడం ద్వారా వాటిని పారద్రోలవచ్చు.
దాల్చిన చెక్క – చీమలను తిప్పికొట్టడానికి దాల్చిన చెక్క పొడి ఒక గొప్ప మార్గం. దాల్చిన చెక్క పొడిని చీమలు ఇంట్లోకి వెళ్లే దారిలో తలుపులు, కిటికీల దగ్గర వేలాడదీయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
పెప్పర్ అప్లికేషన్ – చీమలను తిప్పికొట్టడానికి మిరియాలు ఉత్తమమైనవి. అల్మారాలు, కిటికీలు, ఆహార నిల్వ ప్రదేశాల చుట్టూ మిరియాల పొడిని చల్లుకోండి. చీమలు కచ్చితంగా పారిపోతాయి.
Also Read: Afternoon Bath Affect: మీరు మధ్యాహ్నసమయంలో స్నానం చేస్తున్నారా..మీరు కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే!