AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Juice Vs Turmeric Water: ఉసిరికాయ జ్యూస్ లేదా పసుపు నీరు.. మెరిసే చర్మానికి ఏది మంచిది..?

Amla vs Turmeric for skin: మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెండు అద్భుతమైన పదార్థాలు ఉసిరికాయ (గూస్బెర్రీ), పసుపు. ఇవి రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత పొందినవి. చర్మ కాంతిని పెంచడంలో, శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడంలో ఇవి విశేష పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని ఎలా, ఎప్పుడు తీసుకోవాలి అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి.

Amla Juice Vs Turmeric Water: ఉసిరికాయ జ్యూస్ లేదా పసుపు నీరు.. మెరిసే చర్మానికి ఏది మంచిది..?
Amla Juice Or Turmeric Water
Rajashekher G
|

Updated on: Feb 16, 2026 | 3:34 PM

Share

మన అందాన్ని కాపాడుకోవడం కోసం మనం అనేక మార్గాలను అనుసరిస్తుంటాం. ఆధునిక జీవనశైలిలో కూడా పాతకాలపు గృహ నివారణలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వంటగదిలో లభించే సహజ పదార్థాలు ఆరోగ్యం, అందానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి రెండు అద్భుతమైన పదార్థాలు ఉసిరికాయ (గూస్బెర్రీ), పసుపు (Turmeric). ఇవి రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత పొందినవి. చర్మ కాంతిని పెంచడంలో, శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడంలో ఇవి విశేష పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని ఎలా?, ఎప్పుడు తీసుకోవాలి అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి.

ఉసిరికాయ రసం ప్రయోజనాలు

ఉసిరికాయ విటమిన్ C సమృద్ధిగా కలిగిన అద్భుతమైన ఫలం. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ స్థితిస్థాపకతను (elasticity) కాపాడుతుంది.

ఉసిరికాయ రసం తీసుకోవడం వల్ల..

అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తుంది. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది. నిస్తేజంగా కనిపించే చర్మాన్ని ఉజ్వలంగా మారుస్తుంది.

చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నవారికి ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పసుపు నీటి ప్రయోజనాలు

పసుపులో ఉండే కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.

పసుపు నీరు తాగడం వల్ల..

చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మొటిమలను నియంత్రిస్తుంది. నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ రంగును సమంగా మార్చడంలో సహాయపడుతుంది. జిడ్డుగల చర్మం, దీర్ఘకాలిక మొటిమలు, మచ్చల సమస్యలతో బాధపడేవారికి పసుపు ఎంతో ఉపయుక్తం.

ఉదయం పూట ఏది మంచిది?

నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు సాధారణ నీరు తాగడం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. అదనంగా, ఉదయం గోరువెచ్చని సహజ పానీయాలు తీసుకోవడం మరింత ప్రయోజనకరం. ఉసిరికాయ రసం, పసుపు నీరు రెండూ ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి పూర్తి ప్రయోజనం అందుతుంది.

సేవించేందుకు ఉత్తమ విధానం

ఒక గ్లాసు తాజా ఉసిరికాయ రసంలో.. చిటికెడు పసుపు పొడి, కొద్దిగా అల్లం రసం కలిపి గోరువెచ్చగా తాగాలి. ఈ మిశ్రమం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి రెట్టింపు కాంతిని అందిస్తుంది. సహజ పదార్థాలతో ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం అత్యుత్తమ మార్గం. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే లోపల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, బయట కనిపించే అందం కూడా సహజంగా మెరుగవుతుంది.

Follow Us
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు
కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు
ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..
యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..
ఇత్తడి.. అల్యుమినియం.. వంట చేసేందుకు ఏ పాత్రలు మంచి ఎంపిక?
ఇత్తడి.. అల్యుమినియం.. వంట చేసేందుకు ఏ పాత్రలు మంచి ఎంపిక?
ఎండల్లో కూలర్‌ ఇలా వాడారంటే.. ఏ క్షణమైనా బాంబ్‌ బ్లాస్ట్‌ తప్పదు!
ఎండల్లో కూలర్‌ ఇలా వాడారంటే.. ఏ క్షణమైనా బాంబ్‌ బ్లాస్ట్‌ తప్పదు!
ఈ కోడి పుంజు ధరతో 4 ఐఫోన్లు కొనుక్కోవచ్చు గురూ.. మరి అంత స్పెషలా
ఈ కోడి పుంజు ధరతో 4 ఐఫోన్లు కొనుక్కోవచ్చు గురూ.. మరి అంత స్పెషలా