​Noni Fruit: ఇది పండుకాదు.. అమృత ఫలం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

|

Dec 04, 2024 | 7:19 PM

ఈ పండులో విటమిన్‌ సి, బయోటిన్, ఫోలేట్, విటమిన్ ఇ, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానికి యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఫైటో న్యూట్రియెంట్ల స్టోర్‌ హౌస్‌ అని అంటున్నారు.

​Noni Fruit: ఇది పండుకాదు.. అమృత ఫలం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Noni Fruit
Follow us on

నోని పండు..దీని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని తొగరు పండు అని కూడా పిలుస్తారు. దీని లోపల చిన్నచిన్న గింజలు ఉంటాయి. దీని ఔషధ గుణాలు, పోషక విలువలు మాత్రం లెక్కలెనన్నీ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పండులో విటమిన్‌ సి, బయోటిన్, ఫోలేట్, విటమిన్ ఇ, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానికి యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. నోని పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఫైటో న్యూట్రియెంట్ల స్టోర్‌ హౌస్‌ అని అంటున్నారు. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని వివిధ జీవరసాయన ప్రతిచర్యలకు ఆహారాన్ని శక్తిగా మార్చడం ద్వారా సరైన జీవక్రియను సంరక్షించడంలో సహాయపడతాయి.

నోని పండు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యల్లో కీల్ల నొప్పులను తగ్గించడానికి నోని ఫ్రూట్‌ జ్యూస్‌ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒకటి నుంచి రెండు గ్లాసుల నోని జ్యూస్‌ తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంతోపాటు ఆరోగ్యకరమైన కణాలను ఆక్సీకరణం, దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాయామానికి ముందు.. నోని జ్యూస్‌ తాగితే శరీరానికి పుష్కలంగా శక్తి అందుతుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది, కండర కణాలు అరిగిపోకుండా కాపాడుతుంది.

నోని జ్యాస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌, సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి. అథెరోస్క్లెరోసిస్, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి. నోని పండ్లలో.. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి, రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి, లక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, శరీరంలోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ఆరోగ్యంగా ఉంచడానికి పొటాషియం సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..