సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ ఇది..! తింటే ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చట..

చలికాలంలో లభించే ఈ పండ్లు సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ అని చెప్పాలి. ఎందుకంటే.. సంక్రాంతి మూడు రోజుల పండుగలో మొదటి రోజున భోగి జరుపుకుంటారు. ఈ రోజున చిన్నారులకు భోగి పళ్లు పోయటం సంప్రదాయం. ఇందులో ప్రదానంగా ఉండేవి రేగు పండ్లు. అలాగే, సంక్రాంతి గొబ్బెమ్మల చుట్టూ పోసే నవధన్యాలతో పాటు రేగు పండ్లు కూడా ఉంటాయి.  ఈ పండ్లు కేవలం పండగ స్పెషల్ మాత్రమే కాదు.. క్రమం తప్పకుండా తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు.

సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ ఇది..! తింటే ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చట..
Jujube Fruit

Updated on: Jan 15, 2026 | 4:22 PM

రేగి పండ్లలో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రేగి పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్తాయి. కాలేయం పని తీరు కూడా మెరుగుపడుతుంది. రేగి పండ్లను సీజన్‌ మొత్తం క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కడుపులో మంట, మలబద్ధకం, చర్మ సమస్యలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు, క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో కూడా ఇవి సహాయపడతాయని నిపుణులు తెలిపారు.

రేగుపళ్ళలో విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా వీటిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులో లభించే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో క్యాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.

రేగిపళ్లలో ఉండే మూలకాలు నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పూట రేగి పళ్ళు తినడం వల్ల మరెన్నో లాభాలు కలుగుతాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..