జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్‌..!

|

Jul 27, 2024 | 3:27 PM

ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, నల్ల మచ్చలను దూరం చేస్తుంది. హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు జామ ఆకులను ఉపయోగించవచ్చు. ఇందుకోసం జామ ఆకులతో పేస్ట్‌ను తయారు చేసి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. జామ ఆకుల పేస్ట్‌ను తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్‌..!
జామ ఆకుల టీ తో జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. ఇందులోని డైటరీ ఫైబరీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులను తీసుకోవడంతో డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవచ్చు. జామ ఆకుల ఎక్స్‌ట్రాక్ట్‌ను తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతుంది. జ్వరం తీవ్రత సైతం తగ్గుతుంది.
Follow us on

జామకాయ, పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. కానీ, జామ ఆకుతో కలిగే లాభాలు చాలా మందికి తెలియదు..కానీ, జామ ఆకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో జామ ఆకులతో కూడా అంతకు మించి ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయిల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జామ ఆకులో జీరో క్యాలరీ కలిగి ఉంది. ఇవి బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. జామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి.

జామ ఆకులు క్రమం తప్పకుండా తినటం వల్ల కడుపు పూతల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. దగ్గు, దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు జామ ఆకులను తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. జామ ఆకులో శరీరానికి ఉపశమనాన్ని కలిగించే యాంటీ అలర్జీ లక్షణాలు ఉన్నాయి. పిండి పదార్థాలు చక్కెరలుగా మారడాన్ని జామ ఆకుల సారం నియంత్రిస్తుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాదు.. జామ ఆకులలో శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి.

జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను దూరం చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు జామ ఆకుల టీ తీసుకోవాలి. జామ ఆకులతో తయారు చేసిన టీ తాగడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. జామ ఆకుల టీతో జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. జామ ఆకులలోని డైటరీ ఫైబ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులతో డెంగ్యూను కూడా తగ్గించుకోవచ్చునని నిపుణుల చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జామ ఆకులను తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతుంది. జ్వరం తీవ్రత సైతం తగ్గుతుంది. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మగవారికి మేలు చేస్తుంది. సంతాన లేమి సమస్యను దూరం చేస్తుంది. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ నుంచి ఉపశమనం అందిస్తాయి. జామ ఆకులను రెగ్యులర్‌గా తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.

జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ముడతలు మాయమవుతాయి. ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, నల్ల మచ్చలను దూరం చేస్తుంది. హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు జామ ఆకులను ఉపయోగించవచ్చు. ఇందుకోసం జామ ఆకులతో పేస్ట్‌ను తయారు చేసి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. జామ ఆకుల పేస్ట్‌ను తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..