Fenugreek Seeds: మెంతులతో మతిపోయే ఆరోగ్య లాభాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు

ఆరోగ్యపరంగా మెంతులు మంచివే అయినా అవి ఎక్కువ మొత్తంలో  తీసుకుంటే అవి మీ కడుపుకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా మీరు డయాబెటిక్ పేషెంట్లు మెంతుల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య నిపుణులు సలహామేరకే మెంతులను తీసుకోవాలని పేర్కొంటున్నారు.

Fenugreek Seeds: మెంతులతో మతిపోయే ఆరోగ్య లాభాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు
Fenugreek

Updated on: Jun 20, 2023 | 6:00 PM

భారతీయ వంట గదుల్లోని పోపుల డబ్బాల్లో మెంతులు కచ్చితంగా ఉంటాయి. కొన్ని కూరల్లో పోపుల్లా వాడే మెంతులు  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి మెంతులు చాలా సాయం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యపరంగా మెంతులు మంచివే అయినా అవి ఎక్కువ మొత్తంలో  తీసుకుంటే అవి మీ కడుపుకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా మీరు డయాబెటిక్ పేషెంట్లు మెంతుల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య నిపుణులు సలహామేరకే మెంతులను తీసుకోవాలని పేర్కొంటున్నారు. మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు రోజువారీ విలువలో 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్, 5 శాతం మెగ్నీషియంను అందిస్తాయి. మెంతుల గురించి మరిన్ని విశేషాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

మెంతులు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండి భావాన్ని ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు మెంతులు తింటే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. మెంతి గింజలలోని శ్లేష్మం జీర్ణశయాంతర చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపు, పేగు గోడలను పూస్తుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు మంచిదని భావిస్తున్నారు. మెంతికూరలో ఉండే సపోనిన్‌లు కొవ్వు పదార్ధాల నుంచి కొలెస్ట్రాల్‌ను శరీరం శోషించడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం శరీరం తక్కువ కొలెస్ట్రాల్‌ను ముఖ్యంగా ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడంలో సాపోనిన్‌లు సహాయపడవచ్చు.

మెంతులు హైపర్‌గ్లైసీమిక్ సెట్టింగ్‌లలో ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఈ విత్తనాలు పీసీఓఎస్ లేదా పీసీఓడీ కోసం అద్భుతమైనవి. ముఖ్యంగా మెంతులు రక్తహీనత చికిత్సలో సహాయపడతాయి. ముఖ్యంగా తల్లి పాల ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెంతులు సరైన మోతాదు ఉపయోగిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మెంతులు వాడే వ్యవధిని బట్టి మంటను తగ్గించడంతో రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచడం వంటి ఇతర సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించడానికి మరింత పరిశోధన అవసరమని కొందరి నిపుణుల భావన.

ఇవి కూడా చదవండి

మెంతులు వాడడం ఇలా

1-2 టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ జీరో క్యాలరీ డిటాక్స్ డ్రింక్‌ను ఉపయోగించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి. మిగిలిపోయిన మెంతి గింజలను నమిలితే సరిపోతుంది.