Poha Breakfast Benefits: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా పోహా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంటే చాలా కష్టం. ఒక్కొక్క సమయంలో ఖచ్చితంగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. కాగా రోజంగా యాక్టీవ్‌గా ఉంచడంలో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ సరైన అల్పాహారం తీసుకుంటే.. రోజంగా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందులో భాగంగానే మార్నింగ్ పోహాను అల్పాహారంగా తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజంతా చురుకుగా ఉండటమే కాకుండా.. మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు. పోహాను ఎక్కువగా దక్షిణ..

Poha Breakfast Benefits: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా పోహా తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Poha

Updated on: Feb 05, 2024 | 5:32 PM

రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంటే చాలా కష్టం. ఒక్కొక్క సమయంలో ఖచ్చితంగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. కాగా రోజంగా యాక్టీవ్‌గా ఉంచడంలో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ సరైన అల్పాహారం తీసుకుంటే.. రోజంగా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందులో భాగంగానే మార్నింగ్ పోహాను అల్పాహారంగా తీసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజంతా చురుకుగా ఉండటమే కాకుండా.. మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు. పోహాను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. ఉదయం అల్పాహారాం పోహా తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ సారి చూద్దాం.

వెయిట్ లాస్ అవుతారు:

బరువు తగ్గాలి అనుకునే వారు ఉదయం లైట్‌గా ఉండే ఆహారం, త్వరగా పొట్ట నిండే ఫుడ్‌ని తీసుకోవలి. ఇలాంటి వాళ్లకు పోహా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కొద్దిగా నిండినా కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో ఇంకేం తీసుకోలేరు. అనవసర తిండిని కూడా కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు.

సులభంగా జీర్ణం అవుతుంది:

పోహాలో ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా లభ్యమవుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఏమీ తలెత్తువు. సులభంగా జీర్ణం అవుతుంది. రోజంతా హ్యాపీగా ఉండొచ్చు. కడుపు ఉబ్బరం, నొప్పిగా అనిపించదు.

ఇవి కూడా చదవండి

శక్తిని అందిస్తుంది:

అల్పాహారంగా పోహా తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. మధ్యాహ్నం భోజనం సమయం వరకు ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. అప్పటి వరకు ఆకలిగా అనిపించదు. శారీరకంగా, మానసికంగా ఉత్సహంగా అనిపిస్తుంది. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో ఇన్ ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

ఐరన్ లభిస్తుంది:

పోహాలో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. రక్త హీనత సమస్య ఉన్నవారు పోహా తిటే రక్త హీనత ఉండదు. ఐరన్ అవసరం అయ్యే గర్బిణీలు, చిన్న పిల్లలు పోహా తింటూ ఉండాలి. ఐరన్ అనేది రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్‌ను పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు.

ఎముకలకు బలం:

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా పోహాను పెరుగుతో కలిపి తింటే.. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. దీంతో ఎముకలకు సంబంధించి సమస్యలు కూడా తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.