AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ల ఆయుష్షుకు బటర్ ఫ్రూట్.. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకున్నారంటే సర్వరోగాలు మటాష్!

అవకాడో.. బటర్ పియర్ అని కూడా పిలుస్తారు. ఇది మెక్సికోలో లభించే స్థానిక పండు. కానీ చాలా మంది దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. ధర ఎక్కువగా ఉండటంతోపాటు ఎక్కువగా లభ్యం కాదు. ఈ కారణంగా చాలా మందికి అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు తెలియదు. మీకు తెలుసా?

వందేళ్ల ఆయుష్షుకు బటర్ ఫ్రూట్.. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకున్నారంటే సర్వరోగాలు మటాష్!
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.
Srilakshmi C
|

Updated on: Jun 30, 2025 | 9:38 PM

Share

ఉదయం పూట సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు పదేపదే చెబుతుంటారు. ఇందుకు ఉత్తమ ఎంపిక అవకాడో. దీనిని బటర్ పియర్ అని కూడా పిలుస్తారు. ఇది మెక్సికోలో లభించే స్థానిక పండు. కానీ చాలా మంది దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. ధర ఎక్కువగా ఉండటంతోపాటు ఎక్కువగా లభ్యం కాదు. ఈ కారణంగా చాలా మందికి అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు తెలియదు. మీకు తెలుసా? దీని వల్ల మీరు ఊహించలేని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వైద్యులు కూడా దీనిని అల్పాహారంగా తినమని చెబుతుంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండును అల్పాహారంతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అవకాడో పండు ప్రయోజనాలు

గుండె ఆరోగ్యం

అవకాడోలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మంచివి. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

జీర్ణ సహాయం

అవకాడోలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఇవి కూడా చదవండి

బరువు నియంత్రణ

అవకాడోలోని ఫైబర్, కొవ్వులు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కాబట్టి, ఈ పండును రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.

వాపు నుండి రక్షణ

అవకాడోలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఈ పండులో విటమిన్లు ఇ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా మద్దతు ఇస్తుంది.

పోషకాలు

అవకాడో విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. అవకాడోను అల్పాహారం, సలాడ్లు, శాండ్‌విచ్‌లు, ఇతర వంటలలో ఉపయోగించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.