
మన శరీరం అనేక కోట్ల కణాలతో కూడిన అవయవాల సముదాయం. కణాలు ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కణాలు దెబ్బతినకుండా రక్షించుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు అత్యంత కీలకమైనవి. అయితే, వండిన, వేయించిన, నిల్వ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం బాగా తగ్గిపోతుంది. దీనివల్ల కణాలు బలహీనపడి, జబ్బుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. అలాంటి వాటికి రిపేర్ చేయడానికి మునగాకు పొడి.. రామబాణంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మునగాకు పొడి.. ఐరన్, కాల్షియం, విటమిన్లు (A, C, E), యాంటీఆక్సిడెంట్లతో నిండిన అద్భుతమైన పోషకాహారం. ఇది రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లైంగిక సమస్యలను దూరం చేస్తుంది. షుగర్ కంట్రోల్, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మం, జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది.
మునగాకు పొడి ఈ యాంటీ ఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చడానికి అద్భుతమైన పరిష్కారం. మునగాకులో క్వెర్సటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. 2014లో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు 14 గ్రాముల (7 గ్రాములు ఉదయం, 7 గ్రాములు సాయంత్రం) మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ నిల్వలు 44% పెరుగుతాయి. ఇది కణాలను జబ్బుల బారి నుండి రక్షించడంలో, వాటిని రిపేర్ చేయడంలో దాదాపు 50% సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ అద్భుతమైన ప్రకృతి ప్రసాదాన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించవచ్చంటున్నారు.
అయితే, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల నిల్వలను బాగా తగ్గిస్తున్నాయి. ఈ లోపాన్ని తీర్చి, యాంటీ ఆక్సిడెంట్లను శరీరంలో పెంచడానికి మునగాకు పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మునగాకు పొడిని.. స్నాక్స్, టిఫిన్, అన్నంలో కలుపుకుని తీసుకోవచ్చు..
అలాగే.. మునగాకు పొడిని ఒక కప్పు లేదా రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి డికాషన్ లాగా తాగొచ్చు.. దానికి తేనె, నిమ్మరసం కలుపుకుంటే పోషక విలువలు పెరుగుతాయి.
మునగాకు పొడిని దోరగా వేయించి, కారప్పొడి లాగా తయారుచేసుకుని రోజూ భోజనాల్లో అన్నంతో పాటు తీసుకోవచ్చు.
మునగాకు పొడిని వంటలలో, కూరలలో, ఫ్రైలలో ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు.
ఇంకా ఆకుల రసం .. చట్నీ, కషాయం కూడా తీసుకోవచ్చు..
నోట్.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి.. మునగాకును ఉపయోగించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..