Benefits of Garlic Water : దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు కరోనాకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. అందుకోసం ఇంట్లోనే ఈ పానీయం తయారుచేసుకొని తాగండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. జలుబు, తేలికపాటి దగ్గు, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, కీళ్ల నొప్పులను తొలగిస్తుంది.
వంట సమయంలో వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆహార రుచి చాలా రెట్లు పెరుగుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వెల్లుల్లిని చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కరోనా నుంచి బయటపడడానికి హోం రెమెడీస్ తీసుకోవాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. వెల్లుల్లి అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. ఇంట్లో వెల్లుల్లి నీరు తయారు చేయడానికి మీరు తక్కువ మంటపై ఒక గ్లాసు నీరు పెట్టాలి. ఆ నీటిలో తొమ్మిది నుంచి పది లవంగాలు వెల్లుల్లి వేసి ఇరవై మూడు నిమిషాలు మరిగించాలి. ఈ నీరు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీరు మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటారు. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీకు తలనొప్పి సమస్య ఉంటే మీరు పచ్చి వెల్లుల్లి తినకూడదు. ముడి వెల్లుల్లి వినియోగం తలనొప్పికి ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లి రసంలో తేనె, నిమ్మకాయ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి 10 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లో తేడా కనిపిస్తుంది.