Korean Glass Skin: కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే.. బియ్యం పిండితో ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే..!!

అంతేకాదు.. ప్రసవం తరువాత బరువు తగ్గడం వల్ల ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ వంటివి కూడా దూరం చేయడంలో బియ్యం పిండి సహాయపడుతుంది. ఆ పేస్ట్‌ను మచ్చలపై రాసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. రోజూ తలస్నానం చేసే ముందు దీన్ని రాసుకుంటే మచ్చలు త్వరగా మాయమవుతాయి.

Korean Glass Skin: కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే.. బియ్యం పిండితో ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే..!!
rice flour for skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2024 | 4:17 PM

ప్రకృతి మనకు ప్రసాదించిన కానుకలలో బియ్యం ఒకటి. అవును అన్నం ఆహారానికే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అందాన్ని కాపాడుకోవడానికి చాలా మంది సహజసిద్ధమైన మార్గాన్ని అనుసరిస్తారు. ఇది చర్మానికి ఎలాంటి అలెర్జీలు లేని పరిష్కారంగా పనిచేస్తుంది. అందులో భాగంగా బియ్యపు పిండి వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యపు పిండిని ఏయే చర్మ సమస్యలకు ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

బియ్యం కడిగిన నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు వినే ఉంటారు. అదేవిధంగా, బియ్యం పిండి కూడా చర్మానికి అద్భుతాలు చేస్తుంది. అలాంటి బియ్యప్పిండి ఫేస్ ప్యాక్‌ తయారీ కోసం 3 చెంచాల బియ్యప్పిండి, పెరుగు, స్కిమ్డ్ మిల్క్‌ని తీసుకుని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ముఖం, మెడ భాగాలకు అప్లై చేసి, తేలికగా మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి.

బియ్యం పిండితో ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవటం వల్ల ముఖంలోని మృతకణాలను తొలగిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. నిస్తేజమైన ముఖంలో మెరుపును తిరిగి తీసుకువస్తుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు కూడా బియ్యం పిండి చక్కటి పరిష్కారం అవుతుంది. ఎండాకాలంలో వచ్చే చెమట, దురద, దద్దుర్లు, హీట్ బంప్స్ మొదలైనవి చర్మంపై చికాకును కలిగిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే బియ్యప్పిండిని నీళ్లలో కరిగించి ఐస్ క్యూబ్స్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. అవి ఐస్ అయిన తర్వాత, మీ చర్మం దురద ఉన్న ప్రాంతాలపై స్మూత్‌గా మసాజ్‌ చేసుకోవాలి. రోజూ 15 నిమిషాలు ఇలా చేస్తే వేసవిలో చర్మ సమస్యలు దూరమవుతాయి.

బియ్యం పిండితో ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖంపై నల్ల మచ్చలు తొలగిపోతాయి. బియ్యం పిండి ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బియ్యప్పిండి, పంచదార కలిపి ముఖానికి పట్టించి లైట్ గా మసాజ్ చేసి కాసేపయ్యాక చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్. ముఖంపై మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా మాయమవుతాయి.

అంతేకాదు.. ప్రసవం తరువాత బరువు తగ్గడం వల్ల ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ వంటివి కూడా దూరం చేయడంలో బియ్యం పిండి సహాయపడుతుంది. దీని కోసం, బియ్యం పిండిలో పసుపు పొడి,పచ్చి పాలు పోసుకుని బాగా కలిపి, ఆ పేస్ట్‌ను మచ్చలపై రాసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. రోజూ తలస్నానం చేసే ముందు దీన్ని రాసుకుంటే మచ్చలు త్వరగా మాయమవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..