ఒకప్పుడు వయసు మళ్లి వారిలో మాత్రమే జుట్టు రాలడం సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలో ఈ సమస్య వెంటాడుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఎయిర్ పొల్యుషన్, వాటర్ పొల్యుషన్ కారణంగా జుట్టు రాలుతోంది. దీంతో చిన్న వయసులోనే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు.
ఇక జుట్టు రాలడం సమస్య మొదలుకాగానే చాలా మంది రకరకాల ఆయిల్స్, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని రకాల షాంపూల కారణంగా జుట్టు రాలడం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక జుట్టు రాలడం మొదలుకాగానే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీని కారణంగా కూడా జుట్టు రాలడం సమస్య మరింత పెరుగుతుంది. అయితే నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా జుట్టు రాఏ సమస్య నుంచి బయటపడొచ్చు. వీటిలో కలబంద బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకీ అలోవెరాతో జుట్టు రాలుడు సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా అలోవెరా నుంచి జెల్‌ను సేకరించాలి. అనంతరం జెల్‌ను జట్టుతో పాటు, మాడకు అప్లై చేయాలి. అనంతరం 1 గంటపాటు ఉంచి తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. కలబందను రెగ్యులర్‌గా ఉపయోగిండచం వల్ల ఇన్ఫెక్షన్స్‌తో పాటు, చుండ్రు, దురద, స్కాల్ప్ చర్మ సమస్యలు తగ్గుతాయి. అలోవేరా జెల్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని పనిచేస్తుంది. ఇది తలపై చర్మ సంబంధిత సమస్యల నుంచి పపశమనం కలిగిస్తుంది.
కొందరిలో తల పొడిగా మారడం ద్వారా చుండ్రు సమస్య పెరుగుతుంది. ఇది కాలక్రమేణ జుట్టు రాలడానికి దారి తీస్తుంది. ఆలోవేరా జెల్ అప్లై చేయడం ద్వారా తల హైడ్రేట్‌గా మారుతుంది. ఇక జుట్టులో అదనంగా నూనె ఉన్నా అలోవెరా జెల్ తగ్గిస్తుంది. ఇది జుట్టును లోపలి నుంచి శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ జుట్టులో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..