AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఉద‌యాన్నే వాము నీటిని తాగితే ఏమౌతుందో తెలుసా..? ఈ మార్పును అస్సలు ఊహించలేరు..

వాము భారతీయ వంటింట్లో సులభంగా లభించే ఒక ప్రముఖ మసాలా దినుసు. జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్‌, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో వాము ఉపయోగకరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాములో ఉండే థైమాల్ వంటి సమ్మేళనాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు తోడ్పడతాయి.

రోజూ ఉద‌యాన్నే వాము నీటిని తాగితే ఏమౌతుందో తెలుసా..? ఈ మార్పును అస్సలు ఊహించలేరు..
Ajwain Water Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jun 03, 2026 | 9:52 PM

Share

వామును అద్భుతమైన మసాలా దినుసుగా పేర్కొంటారు.. వాము మన భారతీయ వంటశాలల్లో సులభంగా లభించే ఒక సాధారణ పదార్థం. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేద మూల గ్రంథమైన అష్టాంగ హృదయంలో మహర్షి వాగ్భటాచారి వామును వాత పిత్త నాశకారినిగా వర్ణించారు. దీని అర్థం వాము శరీరంలో వాత దోషం (గ్యాస్), పిత్త దోషం (ఎసిడిటీ) వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఈ దోషాలు శరీరంలో అసమతుల్యతకు కారణమై అనేక అనారోగ్యాలకు దారితీస్తాయి.. అలాంటి సమస్యలకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేద దృక్పథం: వాత, పిత్త దోషాల నివారణ

వాత దోషం వల్ల కడుపులో గ్యాస్, శరీర నొప్పులు, మోకాళ్ళ నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పిత్త దోషం ఎసిడిటీకి దారితీసి కడుపులో మంట, త్రేపులు, కడుపు నొప్పి, నులిపురుగులు, డయాబెటిస్, గుండె సమస్యలు, హై బ్లడ్ ప్రెజర్ వంటి 80 శాతం అనారోగ్యాలకు కారణమవుతుంది. వాము ఈ వాత పిత్త దోషాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది, తద్వారా అనేక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వాము నీటితో బరువు తగ్గడం

బరువు తగ్గాలని కోరుకునే వారికి వాము ఒక అద్భుత ఔషధం.. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వామును నానబెట్టి, ఉదయం బ్రష్ చేయకుండానే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. వాము గింజలను నమిలి మింగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఒక నెలలో 5 నుండి 10 కిలోల బరువు తగ్గుతారు. ఇది పొట్టలోని కొవ్వును తగ్గించి, శరీరాన్ని సన్నబరచడంలో తోడ్పడుతుంది.

జీర్ణ సమస్యలకు వాము పరిష్కారం

గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, ఎలాంటి కడుపునొప్పి సమస్యకైనా వాము అద్భుతమైన ఔషధం. రాత్రి నానబెట్టిన వాము నీళ్ళను ఉదయం కొద్దిగా వేడి చేసి, అందులో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల ఈ సమస్యలన్నీ నయమవుతాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్ నియంత్రణలో వాము పాత్ర

ఉదయాన్నే వాము నీళ్లు తాగడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలోని షుగర్‌ను శక్తిగా మార్చుతుంది. ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతుంది. వాము నీటిని తాగడం ద్వారా ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడి.. ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ అనేది జీవితకాలం మందులు వాడాల్సినంత పెద్ద అనారోగ్యం కాదని, ఆయుర్వేద పద్ధతులను పాటించడం ద్వారా దీనిని సులభంగా తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నివారణ

కీళ్ల నొప్పులు,మోకాళ్ల నొప్పులు సాధారణంగా పిత్త దోషం వల్ల శరీరంలో ఎసిడిటీ పెరిగి, యూరిక్ యాసిడ్ చేరడం ద్వారా వస్తాయి. ఈ యూరిక్ యాసిడ్ పాదాలలో, అరికాళ్ళలో చేరి నొప్పులకు కారణమవుతుంది. వాము శరీరంలోని ఎసిడిటీని తగ్గించి, యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టీ, మసాలా, కారం ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించి, వాము నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తీవ్రమైన నొప్పులకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం మంచిది.

ఆహారపు అలవాట్లు – జీవనశైలి మార్పులు

వాము ప్రయోజనాలతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా చాలా ముఖ్యం. రిఫైన్డ్ ఆయిల్స్‌ను తగ్గించి, అల్యూమినియం, నాన్-స్టిక్ పాత్రలకు బదులుగా లోహ లేదా మట్టి పాత్రలను ఉపయోగించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో 50% ఉడికించిన కూరగాయలు – పండ్లు ఉండేలా చూసుకోవాలి. రెస్టారెంట్ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్‌ను తగ్గించి, వీలైనంత వరకు పచ్చి సలాడ్స్ తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం, 50% పచ్చి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మంచి ఆహారం – వాము వంటి సంప్రదాయ ఔషధాల వినియోగం మిమ్మల్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతుంది.

వామును నేరుగా తినొచ్చు.. అంతేకాకుండా రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగొచ్చు.. ఇంకా వేడి నీటిలో మరిగించి తీసుకోవచ్చు..

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us