Airplane Water: విమానం జర్నీ చేసే వారికి అలర్ట్.. ఆ నీళ్లు తాగారో వాంతులు, విరోచనాలు అవుతాయ్‌ జాగ్రత్త!

విమానంలో వచ్చే ట్యాప్‌ నీటి గురించి. మనకు బ్రష్ చేసుకోవాలన్నప్పుడు లేదా చేతులు, ముఖం కడుక్కోవాలనిపించినప్పుడు విమానంలోని ట్యాప్‌ నీటిని వాడటం సహజమే. కానీ ఆ నీరు నిజంగా ఎంత వరకు సురక్షితం? విమానాల్లో ఉపయోగించే నీరు విమానం నేల మీద ఉన్నప్పుడు..

Airplane Water: విమానం జర్నీ చేసే వారికి అలర్ట్.. ఆ నీళ్లు తాగారో వాంతులు, విరోచనాలు అవుతాయ్‌ జాగ్రత్త!
E Coli And Coliform In Airplane Water

Edited By:

Updated on: Mar 06, 2026 | 7:47 PM

విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఉత్సాహం, ఆనందం. కిటికీ పక్కన కూర్చొని మేఘాల మధ్య ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. కానీ ఈ ప్రయాణంలో చాలా మందికి తెలియని ఒక చిన్న కానీ ఆసక్తికరమైన విషయం ఉంది. అదే విమానంలో వచ్చే ట్యాప్‌ నీటి గురించి. మనకు బ్రష్ చేసుకోవాలన్నప్పుడు లేదా చేతులు, ముఖం కడుక్కోవాలనిపించినప్పుడు విమానంలోని ట్యాప్‌ నీటిని వాడటం సహజమే. కానీ ఆ నీరు నిజంగా ఎంత వరకు సురక్షితం? విమానాల్లో ఉపయోగించే నీరు విమానం నేల మీద ఉన్నప్పుడు ప్రత్యేకమైన వాటర్‌ ట్యాంకుల్లో నీటిని నింపుతారు. ఆ ట్యాంకుల్లోనే ఆ నీరు నిల్వ ఉండి ప్రయాణ సమయంలో ఉపయోగిస్తారు. అ ట్యాంకులు విమానం పైకప్పులో ఉంటాయి. ఇక్కడే అసలు సమస్య ఉంది.

ఈ నీటి ట్యాంకులు, వాటికి అనుసంధానమైన పైపులు ఎపుడో ఏడాదికి ఒకసారి కానీ క్లీన్ చేయరు. దీని వల్ల కాలక్రమేణా వాటిలో బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంటుంది. 40 వేల అడుగుల ఎత్తు వరకు విమానం ప్రయాణిస్తుంది. ఈ సమయంలో విపరీతమైన సూర్యరశ్మికి ఈ వాటర్ ట్యాంకులు గురవుతాయి. మళ్లీ నేలపైకి రాగానే వెంటనే చల్లబడిపోతాయి. ఈ పరిణామాలతో ఈ కోలి అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కొంతమందికి విమాన ప్రయాణం తర్వాత వాంతులు, విరోచనాలు అవుతాయి. ప్రయాణం పడక అనుకుంటారు కానీ అసలు కారణం ఇదే అంటున్నారు నిపుణులు.అందుకే ఆరోగ్య నిపుణులు విమాన ప్రయాణంలో ట్యాప్‌ నీటిని తాగడం లేదా దానితో పళ్ళు తోమడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని విమానాల్లో ప్రయాణికులకు ఇస్తున్న టీ లేదా కాఫీ కూడా ఈ ట్యాప్‌ నీటితోనే తయారవుతుంది. అంటే మనం గమనించకుండా అదే నీటిని పరోక్షంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రయాణ సమయంలో సీల్డ్‌ బాటిల్‌ వాటర్‌ తాగడం ఉత్తమమైన మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. మీ దగ్గర చిన్న వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం కూడా మంచి అలవాటు. చేతులు కడుక్కోవాల్సి వచ్చినా, వీలైతే సానిటైజర్‌ ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. చిన్న విషయంలా అనిపించినా. ఇలాంటి జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి ఇకపై మీరు విమానంలో ప్రయాణం చేస్తే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి — ట్యాప్‌ నీరు కనిపించినంత సురక్షితం కావచ్చు, కావకపోవచ్చు కూడా. అందుకే ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us