
ప్రస్తుత తరుణంలో మారిన జీవన విధానం కారణంగా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యబారిపడుతున్నారు. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుండేది అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తక్కువ ఏజ్ ఉన్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కీళ్లనొప్పులు తగ్గాలంటే టమాటోను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్ సి, పొటాషియం కూడా టమోటాలలో ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
* వంట గదిలో పసుపుకు ఉండే ప్రధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రతీ వంటల్లో పసుపును ఉపయోగిస్తుంటారు. పసుపలో ఉండే కర్కుమిన్ అనే మూలకం శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
* పాలకూరలో విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు.. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వాపును తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.
* పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మంటను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. శస్త్రచికిత్స తర్వాత వాపును తగ్గించడానికి బ్రోమెలైన్ సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది.
* సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..