Health: కాబోయే అమ్మలూ.. ఈ పండ్లు తింటున్నారా.? చాలా డేంజర్..
ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. కొన్ని రకాల ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని పండ్లు గర్భిణులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పండ్లలో ఉండే కొన్ని రసాయనాలు, సమ్మేళనాలు గర్భాశయ కండరాలను ప్రభావితం చేస్తాయి...
ప్రతీ మహిళా జీవితంలో ఎంతో కీలకమైన దశ గర్భదారణం సమయం. తనలాంటి మరో రూపానికి జన్మనిస్తున్నామన్న సంతోషం, అప్పటి వరకు ఎప్పుడూ చూడని మార్పులు శరీరంలో చోటు చేసుకోవడం వంటి కారణంగా మహిళలలో ఆందోళన పెరుగుతుంది. అందుకే గర్భం దాల్చిన తర్వాత మహిళలు తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలిలో మార్పుల వరకు అన్నింటిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. కొన్ని రకాల ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని పండ్లు గర్భిణులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పండ్లలో ఉండే కొన్ని రసాయనాలు, సమ్మేళనాలు గర్భాశయ కండరాలను ప్రభావితం చేస్తాయి. గర్భస్రావం లేదా ప్రీ-టర్మ్ డెలివరీ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో రెండు పండ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భధారణ సమయంలో బొప్పాయికి పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే పాపైన్, పెప్టిన్ అనే ఎంజైమ్‌లు గర్భధారణకు హానికరం. కా కాబట్టి బొప్పాయిని గర్భధారణ సమయంలో నివారించాలి. బొప్పాయిలో ఉండే కార్పైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది, అది అబార్షన్‌కు దారి తీస్తుంది. ఇది కాకుండా, బొప్పాయిలో లేటెక్స్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది, ఇది గర్భాశయంలో వాపునకు కారణమవుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయిని పూర్తిగా తినకూడదు.
గర్భం దాల్చిన మహిళలు తీసుకోకూడని మరో పండు పైనాపిల్. ఇందులో బ్రోమెలైన్ అనే రసాయనం ఉంటుంది. ఇది గర్భాశయ కండరాల నొప్పులను కలిగించే ఒక రకమైన ఫైటోకెమికల్. ఇది గర్భస్రావం లేదా ప్రీ-టర్మ్ డెలివరీ అవకాశాలను పెంచే కండరాల సంకోచాలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పైనాపిల్ తినడం వల్ల గర్భధారణ సమయంలో తీవ్రమైన సమస్యలు వస్తాయని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…