Healthy Life: అనారోగ్యం ఆమెను చూస్తే భయపడుతుంది.. 98 ఏళ్ల బామ్మ చెప్తున్న హెల్త్ సీక్రెట్స్ ఇవి..

ఎంత సంపాదించి ఏం లాభం.. పట్టుమని పాతికేళ్లైనా ఏ అనారోగ్యం లేకుండా ఉండలేకపోతున్నారు. కొందరికి బరువు సమస్య. మరికొందరికి షుగర్, ధైరాయిడ్, పీసీవోడి, బీపీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలు. కానీ ఈ బామ్మ మాత్రం మరికొద్ది రోజుల్లో సెంచరీ కొట్టేస్తుంది. అది కూడా ఎలాంటి జబ్బు లేకుండా. మరి ఈ వయసులోనూ ఇంత చురుకుగా ఉండటానికి ఏంటి సీక్రెట్ అంటే ఈ బామ్మ కొన్ని విషయాలను పంచుకుంది అవేంటో చూడండి.

Healthy Life: అనారోగ్యం ఆమెను చూస్తే భయపడుతుంది.. 98 ఏళ్ల బామ్మ చెప్తున్న హెల్త్ సీక్రెట్స్ ఇవి..
98 Year Old Lady Health Secrets

Updated on: Apr 10, 2025 | 2:51 PM

హిమాలయాల్లోని ఓ చిన్న పట్టణంలో 98 ఏళ్ల ఓ వృద్ధురాలు పర్యాటకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. చిన్న శరీరం, ప్రకాశవంతమైన చిరునవ్వుతో అందరినీ ఎంతో ఉత్సాహంగా పలకరిస్తుంటుంది. ఆమె ఎనిమిది దశాబ్దాలుగా యోగా సాధన చేస్తోంది. ఆమె ఆరోగ్యం, మానసిక చురుకుదనం చూసి ఆశ్చర్యపోనివారుండరు. ఇంత వయసొచ్చినా ఈ బామ్మ ఇలా ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలను పంచుకుంటోంది. అందుకు కారణం ఆమె ఉదయపు అలవాట్లేనట. రోజును తనలా ప్రారంభిస్తే ఎన్నేళ్లైనా ఇంతే యవ్వనంగా ఉండొచ్చని చెప్తోంది. మరి అవేంటో మీరూ చూసేయండి.

సూర్యోదయంతో స్వాగతం

ఈ బామ్మ తెల్లవారకముందే లేస్తుంది. బాల్కనీలో నిలబడి సూర్యోదయాన్ని కృతజ్ఞతతో చూస్తుంది. ఈ సమయం కొత్త రోజుకు శాంతిని, సానుకూల శక్తిని ఇస్తుందని ఆమె భావిస్తుంది. ఉదయ వెలుతురు నిద్ర చక్రాన్ని సరిచేసి, మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

స్ట్రెచింగ్ వ్యాయామాలు

తర్వాత సాధారణ యోగా వ్యాయామాలు చేస్తుంది. భుజాలు తిప్పడం, నెమ్మదిగా వంగడం వంటి సులభమైన కదలికలతో శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ఉదయం శరీరం సాగే గుణం కలిగి ఉంటుందని, దీన్ని సరైన రీతిలో రూపొందించాలని ఆమె నమ్ముతుంది.

ఆలోచనతో తాగడం

అల్లం, నిమ్మరసం కలిపిన వేడి నీటిని నెమ్మదిగా తాగుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అందిస్తుందని ఆమె భావిస్తుంది. తొందరపడకుండా తాగడం మనసును ఒత్తిడి నుంచి దూరంగా ఉంచుతుందని ఆమె అనుభవం.

శ్వాస వ్యాయామాలు

ప్రాణాయామం లాంటి శ్వాస వ్యాయామాలతో మనసును కేంద్రీకరిస్తుంది. నాలుగు సెకన్లు ఊపిరి పీల్చి, నాలుగు సెకన్లు వదులుతూ శాంతిని పొందుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుందని ఆమె విశ్వసిస్తుంది.

రోజుకు ఒక సంకల్పం

రోజును ప్రారంభించే ముందు ఒక సంకల్పాన్ని నిర్ణయిస్తుంది. శాంతి లేదా సులభంగా నడవడం వంటివి. ఇది మనసుకు దిశానిర్దేశం చేసి, రోజంతా సానుకూలంగా ఉండేలా చేస్తుందని ఆమె భావిస్తుంది.

మెదడుకు ఎక్సర్ సైజ్

సుడోకు లేదా క్రాస్‌వర్డ్‌తో మెదడును చురుగ్గా ఉంచుతుంది. మనసుకు వ్యాయామం అవసరమని, ఇది చురుకుదనాన్ని కాపాడుతుందని ఆమె నమ్మకం. ఈ చిన్న ఆట ఆమె మానసిక సామర్థ్యాన్ని ఇన్నేళ్లూ ఉంచింది.

ఆనందం కోసం ఆట

చివరగా, పాటలు పాడటం లేదా రేడియోలో నృత్యం చేయడం ఈ బామ్మకు ఎంతో ఇష్టమట. ఆట లేని జీవితం అసంపూర్ణమని ఆమె భావన. ఈ ఆనందంతోనే ఆమె తన రోజును సంతోషంగా మొదలుపెడుతుంది.