కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. తిన్నా లావు అవ్వని 50 ఫుడ్స్ గురించి తెలిస్తే అవాక్కే..

బరువు తగ్గడం విషయంలో మనందరికీ ఉన్న అతిపెద్ద శత్రువు ఆకలి. తక్కువ కేలరీలు తీసుకోవాలనే ఉద్దేశంతో తక్కువ ఆహారం తిని, ఆకలి తట్టుకోలేక మళ్లీ జంక్ ఫుడ్ మీద పడిపోతుంటాం. ఈ సమస్యకు పరిష్కారమే వాల్యూమ్ ఈటింగ్. కేలరీల భయం లేకుండా మీరు మనసారా అతిగా తిన్నా బరువు పెరగనివ్వని 50 సూపర్ ఫుడ్స్ మీకోసం. అవేంటో తెలుసుకుంటే మీ డైట్ ప్లాన్ మారిపోవడం ఖాయం..

కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. తిన్నా లావు అవ్వని 50 ఫుడ్స్ గురించి తెలిస్తే అవాక్కే..
How To Lose Weight Without Being Hungry

Updated on: Jan 17, 2026 | 9:34 PM

సాధారణంగా డైటింగ్ అంటే తక్కువ తినడం అని అందరూ భావిస్తారు. కానీ తక్కువ తినడం వల్ల నీరసం రావడం, జీవక్రియ మందగించడం, ఆకలి తట్టుకోలేక చివరకు మళ్లీ జంక్ ఫుడ్ వైపు వెళ్లడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాల్యూమ్ ఈటింగ్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు కోచ్ కెవ్. మనం తినే ఆహారం పరిమాణం ఎక్కువగా ఉండి, అందులోని కేలరీలు తక్కువగా ఉండటమే ఈ పద్ధతి ఉద్దేశ్యం. దీనివల్ల కడుపు నిండుగా ఉన్నట్లు మెదడుకు సంకేతాలు అందుతాయి. కానీ శరీరంలోకి తక్కువ కేలరీలు మాత్రమే వెళ్తాయి.

కోచ్ కెవ్ సూచించిన హెల్తీ ప్లేట్ టెంప్లేట్..

ప్రోటీన్: 200 గ్రాములు
కూరగాయలు: 200 గ్రాములు
పిండి పదార్థాలు (కార్బ్స్): 100 గ్రాములు
పండ్లు: 150 గ్రాములు

మీ డైట్ లిస్ట్‌లో ఉండాల్సిన ఆ 50 ఆహారాలు

కండరాల పుష్టికి, ఆకలిని అదుపులో ఉంచడానికి ఇవి ఉత్తమమైనవి..

  • గుడ్డు తెల్లసొన: 52 కిలో కేలరీలు
  • చికెన్ బ్రెస్ట్: 110 కిలో కేలరీలు
  • కొవ్వు లేని గ్రీకు పెరుగు: 59 కిలో కేలరీలు
  • పనీర్ (తక్కువ కొవ్వు): 81 కిలో కేలరీలు
  • చేపలు (టిలాపియా, కాడ్): 80 కిలో కేలరీలు
  • రొయ్యలు: 85 కిలో కేలరీలు
  • తక్కువ కేలరీల కార్బోహైడ్రేట్లు:

బియ్యం, గోధుమలకు బదులుగా వీటిని ట్రై చేయండి.

  • కాలీఫ్లవర్ రైస్: 25 కిలో కేలరీలు
  • దోసకాయ నూడుల్స్: 17 కిలో కేలరీలు
  • రైస్ కేకులు: 35 కిలో కేలరీలు
  • షిరాటకి రైస్, నూడుల్స్: కేవలం 10 కిలో కేలరీలు

అపరిమితంగా తినగలిగే కూరగాయలు

వీటిలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

  • దోసకాయ: 15 కిలో కేలరీలు
  • టమోటాలు: 18 కిలో కేలరీలు
  • పాలకూర: 15-23 కిలో కేలరీలు
  • మష్రూమ్స్: 22 కిలో కేలరీలు
  • క్యాబేజీ-కాలీఫ్లవర్: 25 కిలో కేలరీలు
  • క్యాప్సికమ్: 31 కిలో కేలరీలు

తీపి కోరికలను తీర్చే పండ్లు

స్వీట్లకు బదులుగా తక్కువ కేలరీల పండ్లను ఎంచుకోండి.

  • పుచ్చకాయ: 30 కిలో కేలరీలు
  • స్ట్రాబెర్రీలు: 32 కిలో కేలరీలు
  • బొప్పాయి: 43 కిలో కేలరీలు
  • నారింజ: 47 కిలో కేలరీలు
  • కివి: 41 కిలో కేలరీలు

ఈ ఆహారాలు అతిగా తిన్నా బరువు పెరగడం దాదాపు అసాధ్యం. అయితే కేవలం ఇవే కాకుండా శరీరానికి అవసరమైన హెల్తీ ఫ్యాట్స్ కూడా తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతకు చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..