Tattoo Tips: టాటూ వేసుకుంటున్నారా.. ఈ తప్పులు చేస్తే మీకు తిప్పలు తప్పవు..

మొదటిసారి టాటూ వేయించుకునే వారికి చాలా ప్రశ్నలు ఉంటాయి. దాని వల్ల ఎంత నొప్పి వస్తుంది..? శరీరంలోని ఏ భాగంలో టాటూ వేయించుకోవాలి..? టాటూ వేయించుకోవడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా..? అయితే ఫస్ట్ టైమ్ టాటూ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Tattoo Tips: టాటూ వేసుకుంటున్నారా.. ఈ తప్పులు చేస్తే మీకు తిప్పలు తప్పవు..
5 Essential Tips To Follow Before Getting A Tattoo

Updated on: Oct 25, 2025 | 2:40 PM

ఈ రోజుల్లో టాటూలు ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మాత్రమే కాక.. తమ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను వ్యక్తపరిచే మార్గంగా కూడా మారాయి. తమ ప్రియమైన వారి గుర్తుగా లేదా మధురమైన జ్ఞాపకాల కోసం శరీరంపై శాశ్వతంగా టాటూలు వేయించుకుంటున్నారు. అయితే టాటూ వేయించుకోవడం ఎంత సరదాగా ఉంటుందో.. దాన్ని తొలగించడం అంత కష్టం. ముఖ్యంగా మొదటిసారి టాటూ వేయించుకునే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటిసారి టాటూ వేయించుకునే ముందు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే:

మంచి ఆర్టిస్ట్‌ను ఎంచుకోండి

మీ శరీరంపై శాశ్వతంగా ఉండే టాటూ కోసం, తప్పనిసరిగా ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్‌ను ఎంచుకోండి. . వారు శుభ్రమైన సూదులు, పరికరాలు వాడుతున్నారో లేదో చూసుకోండి.
ఎందుకంటే అవి చర్మ వ్యాధులు లేదా అలెర్జీలకు దారితీయవచ్చు.

డిజైన్‌ను తెలివిగా ఎంచుకోండి

టాటూ అనేది మీ ఆలోచనలు, భావాలను ప్రతిబింబించాలి. కాబట్టి కేవలం ట్రెండీగా ఉందని కాపీ చేయకుండా మీ వ్యక్తిత్వాన్ని సూచించే డిజైన్‌ను ఎంచుకోండి. మొదటిసారి వేయించుకునేవారు నొప్పిని తట్టుకోవడానికి వీలుగా చిన్న టాటూతో ప్రారంభించడం మంచిది. డిజైన్ నచ్చితే, అది మీ చర్మంపై ఎలా ఉంటుందో చూడటానికి డిజిటల్ ట్రయల్ యాప్‌లను ఉపయోగించండి.

 చర్మాన్ని సిద్ధం చేయండి

టాటూ వేయించుకోవడానికి 24 గంటల ముందు ఆల్కహాల్, కాఫీ, నొప్పి మాత్రలు తీసుకోకండి. ఇవి రక్తం పలచబడేలా చేస్తాయి. శరీరంలో నీరు పుష్కలంగా ఉండేలా చూసుకోండి

నొప్పిని భరించడం

మొదటిసారి టాటూ వేయించుకోవడం బాధాకరం, ఒత్తిడితో కూడుకున్నది. అందుకే నొప్పిని భరించడానికి మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఖాళీ కడుపుతో టాటూ వేయించుకోవడం మానుకోండి. లేదంటే తలతిరగడం లేదా మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది. నొప్పిని మర్చిపోవడానికి మీ దృష్టిని మళ్లించుకోండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టాటూ పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 24 గంటల వరకు టాటూ వేసిన ప్రాంతాన్ని నీటితో తడపవద్దు. ఆర్టిస్ట్ సూచించిన ఆయింట్‌మెంట్ లేదా మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా అప్లై చేయండి. కొన్ని రోజుల పాటు ఈత కొట్టడం, జిమ్‌కి వెళ్లడం, సూర్యరశ్మికి గురికాకుండా జాగ్రత్త వహించండి. టాటూ అనేది మీతో శాశ్వతంగా ఉండే ఒక కళ. కాబట్టి, అన్ని జాగ్రత్తలు తీసుకుని, పూర్తి అవగాహనతోనే ఈ ప్రక్రియకు సిద్ధం కావాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..