మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా..? ఇలా చేస్తే మాయమైపోతాయట.. ట్రై చేయండి..

ఇంట్లో ఎంత పరిశుభ్రత ఉన్నప్పటికీ ఎలుకల భయం వెంటాడుతూనే ఉంటుంది. చాలా ఇళ్లల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇవి ఆహారాలను, కూరగాయాలను, తినుబండారాలను పాడుచేయడమే కాకుండా ఇంట్లో ఉంచిన వస్తువులన్నీ కొరుకుతూ ఉంటాయి. కొన్నిసార్లు దుస్తులను కూడా కొరుకుతూ పనికిరాకుండా చేస్తాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటారు.

మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా..? ఇలా చేస్తే మాయమైపోతాయట.. ట్రై చేయండి..
Rats

Updated on: Apr 07, 2024 | 10:24 AM

ఇంట్లో ఎంత పరిశుభ్రత ఉన్నప్పటికీ ఎలుకల భయం వెంటాడుతూనే ఉంటుంది. చాలా ఇళ్లల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇవి ఆహారాలను, కూరగాయాలను, తినుబండారాలను పాడుచేయడమే కాకుండా ఇంట్లో ఉంచిన వస్తువులన్నీ కొరుకుతూ ఉంటాయి. కొన్నిసార్లు దుస్తులను కూడా కొరుకుతూ పనికిరాకుండా చేస్తాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలుకలను తమ ఇళ్ల నుంచి తరిమికొట్టడానికి ప్రజలు ఎలుకలను చంపే మందులను, బోన్లను, గమ్ లాంటి వస్తువులను ఉపయోగిస్తారు. అయితే, ఎలుకలను చంపే మందు ఉపయోగిస్తే.. అవి తిని ఇంట్లో ఏదో ఒక మూలలో పడిపోతాయి.. వాటిని గమనించకపోతే.. ఇంట్లో జీవించడం చాలా కష్టంగా మారుతుంది. వాసనతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో నుంచి ఎలుకలను తరిమికొట్టడానికి మీరు కొన్ని ఇంటి నివారణల సహాయం తీసుకోవచ్చు. ఎలుకలను చంపకుండా ఇంట్లో నుండి తరిమికొట్టగలిగే కొన్ని ఇంటి నివారణల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

ఎలుకలను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు చిట్కాలు..

ఉల్లిపాయలు: ఉల్లి వాసనకు ఎలుకలు పారిపోతాయి. ఇంట్లో నుండి ఎలుకలను నివారించడానికి మీరు పొట్టు ఒలిచిన ఉల్లిపాయలను ఉంచాలి. దీంతో దాని వాసనకు ఎలుకలు వెంటనే ఇంటి నుంచి పారిపోతాయి.

ఎర్ర మిరపకాయ: ఎలుకలను తరిమికొట్టడానికి ఎర్ర మిరపకాయలను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఎర్ర మిరపకాలను ఉంచండి. ఈ చిట్కాతో కూడా ఎలుకలు పారిపోతాయి.

వెల్లుల్లి: వెల్లుల్లితో కూడా ఎతుకలను తరిమికొట్టవచ్చు.. దీని కోసం వెల్లుల్లిని సన్నగా తరిగి ఇంట్లో ఓ మూలన పెట్టుకోవాలి. వెల్లుల్లి వాసనకి ఎలుకలు పారిపోతాయి.

పుదీనా: కాటన్ బాల్‌లో పుదీనా వేసి ఎలుకలు సంచరించే ప్రదేశంలో ఉంచండి. దీని వాసనలకు ఎలుకలు ఇంట్లోంచి పారిపోతాయి.

పొగాకు: ఎలుకలను ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి పొగాకును కూడా ఉపయోగించవచ్చు. పొగాకులో ఉండే మత్తు పదార్ధం ఎలుకలను చికాకుపెడుతుంది. దీంతో అవి ఇంటి నుంచి పారిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..