
మెరిసే, అందమైన చర్మం కోసం చాలామంది ఖరీదైన క్రీములు, బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకుంటారు. కానీ చర్మ ఆరోగ్యం లోపలి నుంచి మెరుగుపడాలంటే సరైన పోషకాహారం అవసరం. ఉదయాన్నే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ద్వారా ఖర్చు లేకుండానే సహజంగా చర్మాన్ని కాంతివంతం చేసుకోవచ్చు. ముఖం మెరిసేలా చేసే ఆ పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం ఆరోగ్యానికి కీలకమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే నిమ్మరసంలో ఉండే సహజ గుణాలు చర్మంపై మచ్చలను తొలగించి, కాంతిని పెంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. అంతేకాకుండా ఇది శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా కాటెచిన్ అధికంగా ఉంటాయి. ఇవి అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టం నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే గ్రీన్ టీ మంటను తగ్గించి చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ప్రతి ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.
కొబ్బరి నీరు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం శరీరానికి సరైన హైడ్రేషన్ అందిస్తాయి. శరీరం తగినంత నీటితో ఉన్నప్పుడు చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. ఇది కణాల పెరుగుదలను ప్రోత్సహించి, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. అందుకే ఉదయం కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..