Walking 10000 steps: రోజుకి 10,000 వేల అడుగులని ఎలా లెక్కిస్తున్నారు? నెల రోజుల పాటు నడవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా..

ప్రస్తుతం చాలా మంది ఫిట్‌గా ఉండటానికి 10,000 అడుగులు నడవడం అనే అలవాటును అవలంబిస్తున్నారు. ఇలా చేయడం వలన బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. అయితే ఈ పదివేల అడుగులు నడిచే అలవాటుని ఒక నెల పాటు ప్రతిరోజూ పాటించడం వలన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. నెల రోజుల పాటు రోజూ 10,000 అడుగులు వేస్తే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నిపుణులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.

Walking 10000 steps: రోజుకి 10,000 వేల అడుగులని ఎలా లెక్కిస్తున్నారు? నెల రోజుల పాటు నడవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా..
Walking 10000 Steps A Day

Updated on: Jun 12, 2025 | 10:30 AM

సోషల్ మీడియాలో మీరు చాలా మంది ఫిట్‌నెస్ బ్యాండ్‌లు లేదా స్మార్ట్ వాచీలు ధరించి రోజంతా అడుగులు లెక్కపెట్టడం చూసి ఉంటారు. కొంతమంది బరువు తగ్గడానికి, కొందరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, మరికొందరు చురుగ్గా ఉండటానికి ఇలా చేస్తారు. చాలా మందికి ఇది దినచర్యలో ఒక భాగంగా మారింది. కొంతమంది రోజూ 1.5 నుండి 2 కిలోమీటర్లు నడుస్తారు. మరికొందరు 10,000 అడుగులు నడవడం అలవాటు చేసుకుంటారు.

10,000 అడుగులు నడవడం అలవాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కేలరీలు ఖర్చవుతాయి. శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోజుకు 10,000 అడుగులు నడవడం అనే దినచర్యను 1 నెల పాటు పాటిస్తే ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్నకు సంబంధించి నిపుణుల సలహా ఏమిటంటే.. నెల రోజుల పటు రోజుకి 10,000 అడుగులు నడవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అయితే దానిని సరైన మార్గంలో చేయాలి.

నిపుణులు ఏమి చెప్పారంటే

డైటీషియన్ సురభి పరీక్ మాట్లాడుతూ 1 నెల పాటు రోజూ 10 వేల అడుగులు నడవడం చాలా మంచిదని అన్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఎవరైనా రోజూ 10 వేల అడుగులు నడిస్తే.. అది కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి మంచిది. 10 వేల అడుగులు నడవడం డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది. కనుక ఏ విధంగా చూసినా 10 వేల అడుగులు నడవడం ద్వారా ఎవరికైనా ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. ఈ అలవాటు వలన ఎటువంటి హాని కలుగదు.

ఇవి కూడా చదవండి

అయితే కొంతమంది మణికట్టు మీద స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ ధరించి 10 వేల అడుగులు లెక్కించేవారు బాత్రూమ్‌కు వెళ్లడం, ఆఫీసుకు వెళ్లడం, ఒక గది నుంచి మరొక గదికి వెళ్లడం వంటి సమయంలో నడవడాన్ని పరిగణలోకి తెసుకుని అంటే తాము మొత్తం రోజులో చేసే కార్యకలాపాల సమయంలో వేసే అడుగులను ఆధారంగా 10 వేల అడుగులుగా లెక్కిస్తారని సురభి పరీక్ చెప్పారు. అయితే ఈ దశలను లెక్కించాల్సిన అవసరం లేదు. 10 వేల అడుగులు నడవడం అంటే రోజూ చేసే కార్యకలాపాల సమయంలో అడుగులను లెక్కించడం కాదని.. దీని కోసం ఉదయం లేదా సాయంత్రం నడవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నడక వలన ప్రయోజనం లభిస్తుంది.

వయస్సు ప్రకారం ఒకరు ఎన్ని అడుగులు నడవాలంటే

హెల్త్‌లైన్ ప్రకారం 10,000 అడుగులు నడవడం మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 10,000 అడుగులు నడవాలనే దినచర్యను అనుసరించవచ్చు. అయితే ఎవరి వయస్సు అయినా 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే.. అటువంటి వారు 8,000 అడుగులు నడిస్తే సరిపోతుంది. పరిశోధన ప్రకారం మీరు ఎన్ని అడుగులు నడిచినా అది 10,000 లేదా 8,000 అయినా క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..