AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZIM vs IND T20 Live Score: తొలి బంతికే వికెట్.. మయాంక్ రీఎంట్రీ అదుర్స్..

India vs Zimbabwe 1st T20 Live Cricket Score: భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 11 మ్యాచ్‌లు గెలిచింది. జింబాబ్వే కూడా భారత్‌ను మూడుసార్లు ఓడించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ZIM vs IND T20 Live Score: తొలి బంతికే వికెట్.. మయాంక్ రీఎంట్రీ అదుర్స్..
Ind Vs Zim 1st T20i Live Updates
Venkata Chari
|

Updated on: Jul 23, 2026 | 4:35 PM

Share

LIVE Cricket Score & Updates

  • 23 Jul 2026 04:35 PM (IST)

    వికెట్‌తో రీఎంట్రీ ఇచ్చిన మయాంక్..

    టీమిండియా స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు.

  • 23 Jul 2026 04:21 PM (IST)

    భారత్ ప్లేయింగ్ XI:

    వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

  • 23 Jul 2026 04:21 PM (IST)

    జింబాబ్వే ప్లేయింగ్ XI:

    బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ.

  • 23 Jul 2026 04:05 PM (IST)

    IND vs ZIM Toss Update: టాస్ గెలిచిన భారత్..

    టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

  • 23 Jul 2026 03:53 PM (IST)

    Zimbabwe vs India, 1st T20I: పిచ్, వాతావరణం..

    హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన ఉపరితలంగా పరిగణించబడుతుంది. కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం అందించవచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. గురువారం హరారేలో ఎండగా ఉంటుంది, వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 25°C వద్ద ఉండే అవకాశం ఉంది.

  • 23 Jul 2026 03:48 PM (IST)

    IND vs ZIM Live Score: ఆధిపత్యం ఎవరిదంటే?

    భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 11 మ్యాచ్‌లు గెలిచింది.

  • 23 Jul 2026 03:44 PM (IST)

    ZIM vs IND T20 Live Score: కీలక పోరుకు రంగం సిద్ధం

    మరికొద్దిసేపట్లో భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య కీలక పోరు మొదలుకానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మరికొద్దిసేపట్లో షురూ కానుంది.

India vs Zimbabwe 1st T20 Live Cricket Score: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో జరిగిన ఏడు టీ20 మ్యాచ్‌లలో ఆరింటిలో జట్టు ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ పర్యటనను పేలవంగా ప్రారంభించి, మూడు మ్యాచ్‌లలో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, హరారే మైదానంలో అతనికి మంచి రికార్డు ఉంది. ఇక్కడే జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు.

Published On - Jul 23,2026 3:43 PM

Follow Us