గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల రోహిత్ సాక్య అనే యువకుడు నకిలీ బ్యాంక్, ఆర్టీఓ యాప్‌లను సృష్టించి రెండేళ్లలో రూ.65 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. చదువు మధ్యలోనే ఆపి AI, కోడింగ్ నేర్చుకున్న రోహిత్.. దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసి వారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.