AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాంటి ఎగ్జామ్‌ అయినా సరే, ఈజీగా పాసై పోవచ్చు..! జపాన్ విద్యార్థుల సీక్రెట్ రెడ్ షీట్ టెక్నిక్‌ వైరల్‌..

చదువు, క్రమశిక్షణ విషయాల్లో జపాన్ దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. అక్కడి విద్యార్థులు కష్టమైన పరీక్షలను సైతం చకచకా క్లియర్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన, సైంటిఫిక్ పద్ధతులను ఉపయోగిస్తారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన విధానమే రెడ్ షీట్ స్టడీ మెథడ్. తాజాగా ఈ వినూత్న స్టడీ టెక్నిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఈ రెడ్‌ షీట్‌ పద్ధతి అంటే ఏమిటి..?

ఎలాంటి ఎగ్జామ్‌ అయినా సరే, ఈజీగా పాసై పోవచ్చు..! జపాన్ విద్యార్థుల సీక్రెట్ రెడ్ షీట్ టెక్నిక్‌ వైరల్‌..
Japanese Study Method
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2026 | 4:21 PM

Share

చదువు, క్రమశిక్షణ విషయంలో జపనీస్ విద్యార్థులకు సాటిలేరని అంటారు. విద్య, నూతన సాంకేతికతల విషయానికి వస్తే, జపాన్ పేరే ఎప్పుడూ ముందుంటుంది. ప్రజల పనిని సులభతరం చేసే సాంకేతికతే దీనికి కారణం. జపాన్ విద్యార్థులు చదువుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఎరుపు రంగు పారదర్శక కాగితాన్ని ఉపయోగిస్తారు. వారు ఇలా ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. ఈ ఎరుపు పారదర్శక కాగితం రహస్యాన్ని వెల్లడించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. జపాన్‌లోని పిల్లలు ఎలాంటి కష్టమైన పరీక్షల కోసమైన సరే.. ఈజీగా చదివేందుకు ఈ రెడ్ పేజ్ లేదా రెడ్ షీట్ పద్ధతిని ఉపయోగిస్తారని ఆ వీడియోలో చెప్పబడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఏమిటీ రెడ్ షీట్ పద్ధతి?:

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన వీడియో ప్రకారం, జపాన్ విద్యార్థులు చదివేటప్పుడు తమ పుస్తకాలు లేదా నోట్‌బుక్స్‌పై ఎరుపు రంగు పారదర్శక ప్లాస్టిక్ షీట్‌ను ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి విపరీతంగా పెరుగుతుందని, ఎంతటి కష్టమైన విషయాన్నైనా సులభంగా గుర్తుంచుకోవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది ఎలా పనిచేస్తుంది? ఈ పద్ధతిని ఉపయోగించడం ఎలా..

హైలైట్ చేయడం: మొదట పుస్తకంలో లేదా నోట్స్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పదాలు, ఫార్ములాలు లేదా తేదీలను ఆకుపచ్చ రంగు మార్కర్‌తో హైలైట్ చేస్తారు.

రెడ్ షీట్ ఉంచడం: ఆ తర్వాత ఆ పేజీపై ఎరుపు రంగు పారదర్శక ప్లాస్టిక్ షీట్‌ను ఉంచుతారు.

పదాలు మాయమవ్వడం: ఎరుపు రంగు షీట్ వేయగానే, ఆకుపచ్చ రంగుతో హైలైట్ చేసిన పదాలు పూర్తిగా కనిపించకుండా పోతాయి లేదా నల్లటి మచ్చలా మారతాయి.

గుర్తు తెచ్చుకోవడం: ఆ ఖాళీ స్థానంలో ఏ పదం ఉందో గుర్తుతెచ్చుకోవడానికి విద్యార్థులు తమ మెదడుపై ఒత్తిడి తెస్తారు.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by daily News (@dail.ynews07)

శాస్త్రీయ కోణం – యాక్టివ్ రీకాల్:

శాస్త్రీయంగా ఈ విధానాన్ని యాక్టివ్ రీకాల్ అంటారు. మామూలుగా సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం కంటే, దాగి ఉన్న సమాచారాన్ని మెదడు ద్వారా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. దీనివల్ల ఆ సమాచారం నేరుగా మెదడులోని లాంగ్ టర్మ్ మెమరీలో నిక్షిప్తమవుతుంది. పరీక్షల సమయంలో రివిజన్ చేయడానికి, ముఖ్యమైన పాయింట్లను వేగంగా పునశ్చరణ చేసుకోవడానికి ఈ జపనీస్ సీక్రెట్ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us