చిత్తూరు జిల్లా రైతుల‌కు గుడ్ న్యూస్…సున్నా వ‌డ్డీతో రుణాలు

రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం సున్నా వ‌డ్డీతో గ‌రిష్ఠంగా ల‌క్ష వ‌ర‌కు క్రాప్ లోన్స్ అందించేందుకు సిద్ద‌మైంది. అందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు తాజాగా జారీ చేసింది.

చిత్తూరు జిల్లా రైతుల‌కు గుడ్ న్యూస్...సున్నా వ‌డ్డీతో రుణాలు

Updated on: Jul 06, 2020 | 4:42 PM

రైతుల‌కు అండ‌గా నిలిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం సున్నా వ‌డ్డీతో గ‌రిష్ఠంగా ల‌క్ష వ‌ర‌కు క్రాప్ లోన్స్ అందించేందుకు సిద్ద‌మైంది. అందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు తాజాగా జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో సుమారు 2.50 ల‌క్ష‌ల మంది రైతులు ఈ కార్య‌క్ర‌మం ద్వారా ల‌బ్ది పొందుతార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ-పంట అప్లికేష‌న్ లో పంట వివ‌రాలు న‌మోదు చేస్తేనే లోన్ పొందేందుకు అర్హులు అవుతారు.

రైతులు వేసిన పంట‌ల‌ను బ‌ట్టి సంబంధిత అధికారులు రుణాలు మంజూరు చేస్తారు. లోన్ మొత్తాన్ని ఏడాది లోపు చెల్లిస్తే ఎట‌వంటి వ‌డ్డీ ఉండ‌దు. అంటే ఏడాది లోపు అయ్యే 4 శాతం వ‌డ్డీని ప్ర‌భుత్వమే చెల్లిస్తుంది కాబ‌ట్టి..రైతుల‌పై భారం ప‌డ‌దు. ఏడాది దాటాక అయితే రైతులే వ‌డ్డీ క‌ట్టాల్సి ఉంటుంది. అర్జీ పెట్టుకున్న రైతులు అర్హ‌త సాధిస్తే వారి బ్యాంకు ఖాతాల‌లో నేరుగా న‌గ‌దు జమ‌వుతుంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది వేసిన పంట‌ల వివ‌రాలను ఈనెల 13 నుంచి ఈ-పంట యాప్ లో రికార్డు చేయాల‌ని జేడీఏ విజ‌య్ కుమార్ ఆదేశించారు.