ఏపీ జగన్‌దే…వైసీపీకి 110 సీట్లు.. బీజేపీ నేత జోస్యం

|

May 08, 2019 | 5:31 PM

ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుంది.  ఎన్నికలు అయిన అనంతరం ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇలా నాయకులంతా ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఏపీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

ఏపీ జగన్‌దే...వైసీపీకి 110 సీట్లు.. బీజేపీ నేత జోస్యం
Follow us on

ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుంది.  ఎన్నికలు అయిన అనంతరం ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇలా నాయకులంతా ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఏపీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీదే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయన్నారు మురళీధర్ రావు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన తర్వాతే ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు ఎన్నో విధాలుగా ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని..ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేదరని చెప్పారు. ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న మురళీధర్ రావు… ఈ ఎన్నికలతో ఏపీలో టీడీపీ ప్రస్థానం ముగిసిపోయిందని చెప్పారు. ఎన్డీయేలో చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు ముసుకుపోయాయని..తమ కూటమిలో టీడీపీ చేరే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.