Andhra Pradesh: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ ఇవాళే.. ఆ ఎమ్మెల్యేలకు నిరాశేనా? ఎంపీ అభ్యర్థులుగా..

| Edited By: Ravi Kiran

Jan 09, 2024 | 12:26 PM

వైసీపీ మూడో లిస్ట్‌పై సీఎం జగన్‌ చేపట్టిన కసరత్తు చివరిదశకు చేరుకుంది. రెండు విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు.. ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై అధిష్ఠానం ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను ఆరాతీస్తూ..ఆయా స్థానాల్లో జరగనున్న మార్పులను వివరించారు.

Andhra Pradesh: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ ఇవాళే.. ఆ ఎమ్మెల్యేలకు నిరాశేనా? ఎంపీ అభ్యర్థులుగా..
CM Jagan
Follow us on

వైసీపీ మూడో లిస్ట్‌పై సీఎం జగన్‌ చేపట్టిన కసరత్తు చివరిదశకు చేరుకుంది. రెండు విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు.. ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై అధిష్ఠానం ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను ఆరాతీస్తూ..ఆయా స్థానాల్లో జరగనున్న మార్పులను వివరించారు. మరోవైపు పెనమలూరు పంచాయితీపై కూడా కొలుసు పార్థసారథితో చర్చించారు సీఎం జగన్‌. అయితే పార్థసారథి సీటు మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు..కొడాలి నాని. అభ్యర్ధులకు చెప్పిన తర్వాతే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. ఇక నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్‌ను..గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫైనల్ చేసింది వైసీపీ అధిష్ఠానం. నియోజకవర్గ నేతలతో సమావేశమైన.. విజయసాయిరెడ్డి నరసరావుపేట టికెట్‌ను గోపిరెడ్డికే కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు అందరం కలిసి పనిచేస్తామన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరోవైపు విజయనగరం జిల్లా ఎస్ కోట పంచాయితీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. ఇరు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు.

ఎంపీ సీట్లపై కూడా కసరత్తు..

ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు V.V.వినాయక్‌ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుండి నటుడు అలీ, కాకినాడ నుండి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుండి చిన్న శీను, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ టికెట్‌ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా..అభ్యర్థిని ఇంకా ఫైనల్‌ చేయలేదని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంటు బరిలో బొత్స ఝాన్సీ, గుంటూరు నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావుపేట నుండి మోదుగుల వేణుగోపాలరెడ్డిలను ఓకే చేసే అవకాశం ఉంది. కర్నూల్ ఎంపీ బరిలో గుమ్మనూరి జయరామ్, నరసాపురం నుండి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుండి మడ్డిసెట్టి వేణుగోపాల్ లేదా విక్రాంత్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే బాపట్ల నుండి నందిగం సురేష్, తిరుపతి నుండి గురుమూర్తి, కడప నుండి అవినాష్ రెడ్డి, రాజంపేట నుండి మిథున్ రెడ్డిల పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకర్‌నారాయణ, హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా శాంత, అరకు ఇన్‌ఛార్జ్‌గా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం.

థర్డ్‌ లిస్ట్‌లో ఉండేది ఎవరు..ఊడేది ఎవరు..? సీటు ఎవరికి..షాక్‌ ఎవరికి..? వైసీపీ తుది జాబితాపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అలాగే ఎంపీ సీట్లపై కూడా పలు సర్‌ప్రైజ్‌లు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..