లోకేష్ విసిరిన సవాల్ నాకు ఓకే , ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ రెడీ, కాని స్వయంగా ఆయనే రావాలి: విజయసాయి

|

Jan 02, 2021 | 7:05 PM

విజయనగరం జిల్లా రామతీర్థం కొండ, ఇవాళ రణక్షేత్రంగా మారింది. రామతీర్థం కొండపై నుంచి కిందికి దిగిన అనంతరం..

లోకేష్ విసిరిన సవాల్ నాకు ఓకే , ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ రెడీ, కాని స్వయంగా ఆయనే రావాలి: విజయసాయి
Follow us on

విజయనగరం జిల్లా రామతీర్థం కొండ, ఇవాళ రణక్షేత్రంగా మారింది. రామతీర్థం కొండపై నుంచి కిందికి దిగిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయి మీడియాతో మాట్లాడారు. మంచి పరిపాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనను తప్పుపట్టేవిధంగా టీడీపీ పార్టీకి చెందిన వాళ్లే రామతీర్థంలో విగ్రహాల విధ్వసం దుశ్చర్యకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపించారు. లోకేష్ విసిరిన సవాల్ ను తాను తీసుకుంటున్నానని విజయసాయి అన్నారు. లోకేష్ చెప్పినట్టుగానే సింహాద్రి అప్పన్న సన్నిధిలో చర్చకు తాను సిద్ధమని విజయసాయి ప్రకటించారు. లోకేష్ ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చర్చకు రెడీ అన్నారు. అయితే, నారా లోకేష్ స్వయంగా చర్చకు రావాలని విజయసాయి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలను కూలగొట్టిన చరిత్ర టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని విజయసాయి ఈ సందర్భంగా ఆరోపించారు. తిరుమలతో వేయి కాళ్ల మండపం, విజయవాడలో పెద్ద ఎత్తున ఆలయాలను కూలగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విజయసాయి ఆరోపించారు. కాగా, రాజకీయనేతల తాకిడితో విజయనగరం జిల్లా బోడికొండ పరిసరాలు వేడెక్కిపోయాయి. అనంతరం రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి పయనమయ్యారు. ఆయన వెంట ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు తదితరులున్నారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికిన దుండగులు అక్కడున్న కోనేరులో పడేయడంతో ఈ అంశం ఏపీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు లేపుతోంది.