వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి గురువారం తుదిశ్వాస విడిచారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

Updated on: Sep 04, 2020 | 7:23 AM

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయ‌న‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. దశరథరామిరెడ్డి మృతి పట్ల సీఎం జ‌గ‌న్, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

దశరథరామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ(రాజ్యసభ) కాగా.. మరో త‌న‌యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా సేవ‌లందిస్తున్నారు. ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో, అందునా అధికార వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

 

Also Read :

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !