వైసీపీ అభ్యర్థుల ప్రకటన రేపు?

అమరావతి: వైసీసీ ఎన్నికల అభ్యర్థల జాబితాను రేపు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 16న శనివారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి, ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అక్కడి నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని వైఎస్‌ జగన్‌ తొలుత భావించారు. […]

వైసీపీ అభ్యర్థుల ప్రకటన రేపు?

Updated on: Mar 16, 2019 | 8:21 AM

అమరావతి: వైసీసీ ఎన్నికల అభ్యర్థల జాబితాను రేపు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 16న శనివారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి, ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అక్కడి నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని వైఎస్‌ జగన్‌ తొలుత భావించారు. అయితే జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కారణంగా ఆయన హైదరాబాద్‌ నుంచి శుక్రవారం నాడే హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్న జగన్‌ శనివారం నాటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. పిడుగురాళ్లలో నిర్వహించవలసిన తొలి ఎన్నికల ప్రచార సభనూ రద్దు చేసుకున్నారు. ఆదివారం నుంచి రోజుకు మూడు జిల్లాల్లో మూడు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతుంది.