AP Local Body Elections: పంచాయతీ ఎన్నికలు.. వైఎస్ఆర్‌సి పార్టీకి షాక్ ఇచ్చిన ఫేక్ వెబ్‌సైబ్.. ఖంగుతిన్న పార్టీ నేతలు..

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఫేక్ వెబ్‌సైట్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది.

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికలు.. వైఎస్ఆర్‌సి పార్టీకి షాక్ ఇచ్చిన ఫేక్ వెబ్‌సైబ్.. ఖంగుతిన్న పార్టీ నేతలు..
Follow us

|

Updated on: Feb 13, 2021 | 8:17 PM

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఫేక్ వెబ్‌సైట్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో వెల్లడైన ఫలితాలను చూసి అధికార పార్టీ నేతలే ఖంగు తన్నారు. ఏంటా ఆని ఆరా తీసిన నేతలకు అసలు విషయం తెలిసిందే. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పలు గ్రామాలకు ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించింది. మధహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు.. పోలింగ్ ముగిసిన తరువాత వెంటనే ఫలితాలను కూడా వెల్లడించారు.

అయితే, పంచాయతీ ఫలితాల కోసం అధికార పార్టీ వైసీపీ ysrcppolls.in పేరిట వెబ్‌సెట్ విడుదల చేసింది. దీన్ని టార్గెట్ చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. వైసీపీ విడుదల చేసిన వెబ్‌సైట్‌కి నకిలీ తయారు చేశారు. ysrvppolls.com పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ సైట్ ద్వారా తప్పుడు ఫలితాలను ప్రకటించారు. దీనిని గమనించిన వైసీపీ నేతలు.. ఆ ఫలితాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఫేక్ వెబ్‌సైట్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.

Fake Website:

Also read:

‘మాతా పిత పూజా దినోత్సవం’గా వేలంటైన్స్ డే, శ్రీరామ్ సేన నినాదం, పబ్ లు, పార్కులపై నిఘా

Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి’లేడీ’