వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభనుంచి వాకౌట్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ నిర్వహించాలంటూ ఆయన సభలో పట్టుబట్టారు. ఓటింగ్ జరపాలంటే సభలో సగం మంది ఉండాలని, దీనిపై ఓటింగ్ సాధ్యం కాదని కేంద్ర మంత్రి రవిశంకరప్రసాద్ సూచించడంతో .. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయసాయి సభనుంచి బయటకి వచ్చేశారు.
ఏపీలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 60 శాతం మంది బీసీలు, వెనుకబడిన వర్గాలే ఉన్నారని బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు. బిల్లుకు కాంగ్రెస్,సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ వంటి పార్టీలు మద్దతునిచ్చాయి. అయితే ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కాబట్టి ఓటింగ్ జరపాలంటే ఖచ్చితంగా సభలో సగం మంది సభ్యులు ఉండాలని, ఓటింగ్ సాధ్యం కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అడ్డుచెప్పకుండా ఓటింగ్ సమయంలో ప్రభుత్వం అడ్డుచెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా విజయసాయి వాకౌట్ చేశారు.
బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాజ్యసభలో నేను ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ తర్వాత ఈరోజు ఓటింగ్ జరపాలని కోరాను. అందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యతిరేకించడంతో నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాను.
video: https://t.co/dfAMSkQI0W pic.twitter.com/rTXflIffxF
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 12, 2019