ప్రముఖ నటి విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించడానికి వెళ్లారు సీఎం జగన్. అనంతరం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ జగన్‌కు ఆశ్చర్యం కలిగేలా ఓ సంఘటన ఎదురైంది. సీనియర్ నటుడు నరేష్, జనగ్‌కు తన తల్లి వైఎస్ అభిమాని అని.. ఇంట్లోని ఓ టేబుల్‌పై పూలమాలలు వేసివున్న వైఎస్ చిత్రపటాలను చూపించారు. అలాగే.. అక్కడ జగన్ ఫొటో ఉండటం కూడా ఆశ్చర్యమనిపించింది. అది చూసిన జగన్ సహా ఇతర నేతలు ఆశ్చర్యపోయారు. నటుడు నరేష్‌ను కౌగిలించుకుని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
వైఎస్ కుటుంబానికి, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో కృష్ణ ఎంపీ పదవిని కూడా అనుభవించారు.